-ప్రభుత్వం బకాయిలుచెల్లించకపోవడంతో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల జీవితాలు రోడ్డునపడ్డాయి
-ఉమ్మడికర్నూలు జిల్లాకు 4ఏళ్లలో జగన్ చేసింది శూన్యం
• జగన్మోహన్ రెడ్డి తక్షణమే ట్రిపుల్ ఐటీ విద్యార్థినీవిద్యార్థుల బకాయిలు చెల్లించాలి
• విద్యార్థుల్ని ఫీజులకోసం వేధించేవిద్యాసంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న ముఖ్యమంత్రి, ట్రిపుల్ ఐటీ యాజమాన్యాల వేధింపులపై ఏం సమాధానం చెబుతాడు?
• 4 ఏళ్లలో ఉమ్మడికర్నూలుజిల్లాకు ఈప్రభుత్వం, ముఖ్యమంత్రిచేసింది శూన్యం
• జిల్లా అభివృద్ధిపై నారాలోకేశ్ సవాల్ విసిరితే వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించలేదు ఉమ్మడికర్నూలుజిల్లాకు జగన్ ఏమీచేలేదు అనిచెప్పడానికి వారి మౌనమే నిదర్శనం
ట్రిపుల్ ఐటీ యాజమాన్యాలు ఫీజులకోసం విద్యార్థుల్ని వేధిస్తుంటే, ముఖ్యమంత్రి స్పందించరా?
టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి
“జగన్మోహన్ రెడ్డి తనఓటుబ్యాంక్ కోసం పెద్దలు మహిళలతోపాటు, అభంశుభం తెలియని విద్యార్థుల జీవితాలతో కూడా ఆటలాడుకుంటున్నాడని, తనతప్పులకు ముఖ్యమంత్రి విద్యార్థుల జీవితాల్ని బలిచేస్తున్నాడు. రాష్ట్రంలోని నాలుగుట్రిపుల్ ఐటీల్లో (ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం) దాదాపు 24వేలమంది విద్యార్థినీవిద్యార్థులున్నారు. వారికి రాష్ట్రప్రభుత్వం ఒక్కోవిద్యార్థికి ఏడాదికి విద్యాదీవెన కింద రూ.50వేలు, వసతిదీవెన కింద రూ.20వేలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా ఒక్కోవిద్యార్థికి రూ.70వేలు చెల్లించాలి. కానీ జగన్ ప్రభుత్వం విద్యాదీవెన కింద ఒక్కొక్కరికి కేవలం రూ.12,500లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంది. ఇంకా రూ.37,500లు చెల్లించాల్సి ఉంది. వసతిదీవెన కింద కేవలం రూ.10 వేలు మాత్రమే చెల్లించిన జగన్ ప్రభుత్వం రూ.10వేలు బాకీపెట్టింది. మొత్తంగా రాష్ట్రప్రభు త్వం ఒక్కొక్కరికి రూ.47,500లు చెల్లించాల్సి ఉంది. ఇటీవల ట్రిపుట్ ఐటీ యాజమాన్యాలు, విద్యాసంస్థల డైరెక్టర్లు బకాయిలు చెల్లించాలని విద్యార్థినీ విద్యార్థులపై ఒత్తిడితేవడం ప్రారం భించారు. ప్రభుత్వం చెల్లించేవరకు తాము ఆగలేమని, విద్యార్థినీవిద్యార్థులు తల్లిదండ్రుల్ని అడిగి తమబకాయిలు చెల్లించాలని విద్యాసంస్థల డైరెక్టర్లు ఆదేశించారు. దాంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో టీడీపీప్రభుత్వం ట్రిపుల్ ఐటీ విద్యార్థినీవిద్యార్థు లకు ఒక్కొక్కరికి ఫీజుకింద రూ.40వేలుఇచ్చేది. చంద్రబాబుగారి హాయాంలో ఒక్క ట్రిపుల్ ఐటీ విద్యార్థికూడా తమకు ప్రభుత్వం బకాయిలు ఇవ్వాలని విలపించిన దాఖలాలు లేవు.
జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఇవ్వాల్సిన సొమ్ము సక్రమంగా చెల్లించనందునే వారిభవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దానికి తోడు టీడీపీప్రభుత్వంలో ట్రిపుల్ ఐటీవిద్యాసంస్థల్లో రూ.40వే లుగా ఉన్న ఫీజు, జగన్ వచ్చాక రూ.77,600లకుపెంచాడు. ఆ డబ్బుని కూడా సకాలంలో సక్రమంగా ఇవ్వకపోవడంతో, విద్యార్థినీ విద్యార్థులు జీవితాలు రోడ్డునపడే దుస్థితి వచ్చింది. గతంలో విద్యాసంస్థలపై సమీక్ష చేసిన సందర్భంలో ఏవిద్యాసంస్థ యాజమాన్యం అయినా ఫీజుల కింద విద్యార్థుల్ని వేధిస్తే, వారిపై క్రిమినల్ కేసులపెట్టాలని ముఖ్యమంత్రి ఉచితసలహా ఇచ్చారు. మరిప్పుడుప్రభుత్వ నిర్వహణలోని ట్రిపుల్ ఐటీలే ఫీజులకోసం విద్యార్థుల్ని వేధి స్తుంటే ముఖ్యమంత్రి ఎవరిపై కేసులు పెడతాడో సమాధానంచెప్పాలి. ట్రిపుల్ ఐటీ యాజమా న్యాలపై కేసులుపెట్టాలో, లేకతనపైనే కేసులుపెట్టాలో ముఖ్యమంత్రి చెప్పాలి.
ముఖ్యమంత్రి తక్షణమే ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు బకాయిలు చెల్లించాలి. లేకుంటే ప్రభుత్వం పై పోరాటానికి టీడీపీ వెనుకాడబోదని హెచ్చరిస్తున్నాం
విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించలేని అసమర్థముఖ్యమంత్రి, మరలా సిగ్గులేకుండా విద్యార్థుల్నే తప్పుపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫీజులకోసం విద్యార్థినీవిద్యార్థుల్ని వేధించిన ట్రిపల్ఐటీ సంస్థల డైరెక్టర్లపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలానే విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల్ని వెంటనే చెల్లించాలని, చెల్లించలేని పక్షంలో విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు అందచేసి, వారిని విద్యాసంస్థల నుంచి గౌరవంగా బయ టకుపంపాలని సూచిస్తున్నాం. ప్రభుత్వం ఇవేవీచేయని పక్షంలో విద్యార్థినీవిద్యార్థుల కోసం పోరాటంచేయడానికి వెనుకాడబోమని టీడీపీతరుపున హెచ్చరిస్తున్నాం.
ఉమ్మడి కర్నూలుజిల్లా అభివృద్ధిపై నారా లోకేశ్ సవాల్ విసిరిన సవాల్ పై వైసీపీనేతలు, మంత్రులు తోకముడిచారు
లోకేశ్ యువగళం పాదయాత్రలో వైసీపీప్రజాప్రతినిధులకు సవాళ్లు విసరడం.. వారు తోకముడవడం రివాజుగా మారింది. ఉమ్మడికర్నూలుజిల్లాలో వైసీపీప్రభుత్వం చేసిన అభివృ ద్ధిపై నారాలోకేశ్ బహిరంగసవాల్ విసిరితే, అధికారపార్టీనేతలు ఎవరూ స్పందించకపోవడం చూస్తే వారు తప్పుఒప్పుకున్నట్టేనని అర్థమవుతోంది. వైసీపీప్రభుత్వం ఇంకా 9నెలలు ఉం టుంది కాబట్టి, ఉమ్మడికర్నూలుజిల్లా అధికారపార్టీనేతలు ముఖ్యమంత్రితో మాట్లాడి, ఈ 4 ఏళ్లలో జిల్లాకుజరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుచేస్తానన్న హామీ ఏమైందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమో విశాఖపట్నంలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుచేస్తామంటారు, మరోపక్క ప్రభుత్వ న్యాయవాది ఏమో హైకోర్ట్ ని ఎక్కడికి మార్చడంలేదని న్యాయస్థానాల్లో అఫిడవిట్ వేస్తారు. ఇలా పొంతనలేని మాటలతో అధికారపార్టీనేతలు ఎన్నాళ్లు ఉమ్మడికర్నూలుజిల్లా ప్రజల్ని మభ్య పెడతారని ప్రశ్నిస్తున్నాం. కర్నూల్లో పెట్టాల్సిన జ్యుడీషియల్ అకాడమీని ఎందుకు గుంటూరుకు తరలించారో కూడా జిల్లావాసులు ముఖ్యమంత్రిని, వైసీపీనేతలు, మంత్రుల్ని నిలదీయాలని కోరుతున్నాం. కృష్ణానదీ యాజమాన్యబోర్డుని కర్నూల్లోకాకుండా విశాఖప ట్నంలో ఎందుకు పెట్టారని జిల్లా డీఆర్సీ సమావేశంలో తామునిలదీస్తే, మంత్రి బుగ్గన సాంకేతికకారణాలని సెలవిచ్చారు. ఆ సాంకేతికకారణాలేమిటో బుగ్గన జిల్లాప్రజలకు చెప్పాలి. అవసరమైతే కర్నూలుజిల్లావాసులు, అధికారపార్టీనేతలు, మంత్రులు ముఖ్యమం త్రి చొక్కాపట్టుకొని నిలదీసి అయినాసరే, కే.ఆర్.ఎం.బీ కార్యాలయం కర్నూల్లోనే ఉండేట్టు చూడాలని డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడికర్నూలులోని ప్రతిఎకరాకు నీళ్లిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, రాయలసీమఎత్తిపోతల పథకాన్ని ఎప్పుడుపూర్తిచేస్తాడో చెప్పాలి. ఆ పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్నకేసులపై వాదనలకు నిష్ణాతులైన లాయర్లను నియమించి స్టేను ఎందుకు ఎత్తేయించలేదో కూడా ముఖ్యమంత్రిచెప్పాలి. తన హాయాంలో కర్నూలుజిల్లా అభివృద్ధికి, అక్కడిప్రజల అవసరాలకు జగన్మోహన్ రెడ్డి 4ఏళ్లలో ఒక్క రూపాయి కూడాకేటాయించలేదు. ఉమ్మడి కర్నూలుజిల్లాకు లెక్కకుమిక్కిలి హమీలిచ్చిన జగన్, అధికారంలోకి వచ్చాక ఒక్కదాన్నికూడా నెరవేర్చలేదు.
కేసులకు భయపడే అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మాణంపై అటు కర్ణాటక ప్రభుత్వా న్ని, ఇటు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నాడు
టీడీపీ హాయాంలో కర్నూలుజిల్లా అభివృద్ధికి అనేక కార్యక్రమాలుచేసింది. హంద్రీనీవా పథకం, ముచ్చుమర్రిఎత్తిపోతల పథకాలు పూర్తిచేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఆలూరు ప్రాంతంలోని తాగు, సాగునీటిసమస్య పరిష్కారానికి చంద్రబాబుగారు వేదవతిప్రాజెక్ట్ నిర్మా ణానికి శంఖుస్థాపనచేస్తే, జగన్మోహన్ రెడ్డి దాన్నిఅటకెక్కించాడు. ఉమ్మడి కర్నూలుజిల్లాలో ఉర్దూయూనివర్శిటీ, ట్రిపుల్ ఐటీ, మెగా సోలార్ పార్క్, సీడ్ పార్క్, ఓర్వకల్లు విమానా శ్రయం వంటివాటిని పూర్తిచేసింది చంద్రబాబుగారే. ఎప్పుడో 2004లో కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల్ని తాముచేసినట్టు చెప్పుకోవడానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా వైసీపీ నేతలు,మంత్రులు సిగ్గుపడాలి. కర్ణాటక తుంగభద్రపై అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మి స్తుంటే కర్నూలుజిల్లా వైసీపీనేతలు, మంత్రులుఎందుకు నోరెత్తరు? ప్రాజెక్ట్ నిర్మాణాన్ని న్యాయ పరంగానే ఎదుర్కుంటామని బుగ్గన చెప్పడం ముమ్మాటికీ బీజేపికి భయపడే. జగన్మోహన్ రెడ్డి కూడా అప్పర్ భద్రప్రాజెక్ట్ నిర్మాణంపై నోరెత్తకపోవడానికి కేంద్రప్రభుత్వంపై ఆయన కున్నభయమేకారణం. కర్ణాటకప్రభుత్వ వైఖరిని ఎప్పుడూ నిలదీయని ముఖ్యమంత్రి అసమర్థత, వైసీపీప్రభుత్వ చేతగానితనం ఉమ్మడికర్నూలుజిల్లాకు శాపంగా మారనుంది. ముఖ్యమంత్రి వైఖరిని ప్రశ్నించలేని కర్నూలుజిల్లా వైసీపీనేతలు, మంత్రులు చరిత్రహీనులు గా మిగిలిపోతారు. నారాలోకేశ్ గారు తనపాదయాత్రలో తాగునీటికోసం ప్రజలు పడుతున్న భాధలుచూస్తున్నారు. ఆలూరుపట్టణంలో ప్రతి10రోజులకు ఒకసారి నీళ్లిస్తున్నారంటే, మంత్రి పనితీరు ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. కోడుమూరుపట్టణంలోకూడా 5, 6రోజులకు ఒకసా రే తాగునీరు ఇస్తున్నారు.
టీడీపీప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఉమ్మడికర్నూలుజిల్లాలోని తాగు, సాగునీటిసమస్య పరిష్కారమవుతుంది. ఇటీవల అకాలవర్షాలకు కర్నూలుజిల్లాలో జరిగిన పంటనష్టం, రైతులసమస్యలపై నారాలోకేశ్ ప్రభుత్వప్రధానకార్యదర్శికి లేఖరాసినా, ప్రభుత్వంలో చలనంలేదు. కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారయంత్రాంగానికి లేఖలు రాసి నా కూడా ఏఒక్కఅధికారి కూడా రైతుల వైపు కన్నెత్తి చూసిందిలేదు. ఇలాంటి దౌర్భాగ్యపు ప్రభుత్వంలో తాము ఉన్నందుకు నిజంగా కర్నూలు జిల్లా వాసులు బోరుమంటున్నారు. కర్నూలుజిల్లాలో అన్నిస్థానాలు వైసీపీనే గెలిచినా, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేకపోవడం నిజంగా బాధాకరం. గ్రామపంచాయతీల నిధుల్ని ఏపీ ప్రభుత్వం లాక్కోవడంతో, చాలాగ్రామాల్లోని సర్పంచ్ లు ప్రజలకు తాగునీరు అందించలేక నానాఅవస్థలుపడుతున్నారు. ఒకచిన్న పైపుముక్క కొనడానికికూడా సర్పంచ్ లవద్ద రూపాయిలేకుండా చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు, వైసీపీనేతలు గట్టిగా నిలదీయాలి.”