Suryaa.co.in

Andhra Pradesh

జగన్ వ్యాఖ్యలు అతనిలోని సైకోయిజానికి ముదిరిన పిచ్చికి నిదర్శనం

• చంద్రబాబు అరెస్ట్ పై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాల నుంచి తప్పించుకోవడానికే జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నాడు
• తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడం… చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపినంత తేలిక్కాదు జగన్
• ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి, కేసుల భయంతో మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడమేనా జగన్ విశ్వసనీయత?
• తల్లి, చెల్లిని తరమేసి.. బాబాయ్ ని చంపి బాత్రూమ్ లో పడుకోబెట్టడమేనా జగన్ విశ్వసనీయత?
• సొంత బాబాయ్ కూతురు రాష్ట్రంలో తనకు న్యాయంజరగదంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టడమేనా జగన్ సాధించిన విశ్వసనీయత?
• తండ్రి చావుకి రిలయన్స్ సంస్థే కారణమని చెప్పి… ముఖ్యమంత్రి అయ్యాక అదే సంస్థ వైస్ ఛైర్మన్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడమేనా జగన్ విశ్వసనీయత?
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర

వైసీపీ సమావేశంలో జగన్ రెడ్డి మాట్లాడిందంతా పచ్చిబూటకమని, చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదంటూ వెకిలినవ్వు నవ్వినప్పుడే ముఖ్యమంత్రి విషస్వభావం బయటపడిందని, ప్రథాన ప్రతిపక్షనేత అరెస్ట్ విషయం తనకు తెలియదంటున్న వ్యక్తి అసలు ముఖ్యమంత్రేనా అన్న అనుమానం కలుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే …

“ జగన్ రెడ్డి వ్యాఖ్యలు విన్నాక ఆయన పిచ్చివాడా అనే సందేహం కలుగుతోంది. అదే నిజమైతే రాజ్యాంగం ప్రకారం మానసికంగా పరిపక్వత లేని వారు రాష్ట్రాన్ని పరిపాలించ డానికి అనర్హులవుతారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ప్రధాన ప్రతిపక్ష నేత అరెస్ట్ పై స్పందిస్తూ వెకిలిగా ఎత్తుకెళ్లారు అంటున్న ముఖ్యమంత్రిని గతంలో సీబీ ఐ వాళ్లు ఎలా ఎత్తుకెళ్లారో గుర్తుచేసుకుంటే మంచిది. ఎవరు ఎత్తుకెళ్తే 16నెలలు జైల్లో ఉన్నాడో కూడా జగన్ ఆలోచించుకోవాలి.

నేడు చంద్రబాబుని అరెస్ట్ చేసింది జగన్ ఆడించినట్టు ఆడే సీఐడీ అధికారులు. కానీ నాడు జగన్ ను అరెస్ట్ చేసి ఊచలు లెక్క పెట్టించింది కేంద్ర ప్రభుత్వ విచారణా సంస్థలైన సీఐడీ, ఈడీ అధికారులు. తన అధీనంలో పనిచేసే అధికారులు.. చంద్రబాబుని అరెస్ట్ చేసిన విషయం తనకు తెలియ దని జగన్ చెప్పడం నిజంగా అతని మానసిక రుగ్మతకు నిదర్శనం.

తన ఇంట్లో.. ఒంట్లో లేని విశ్వసనీయత గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటు
చంద్రబాబుకి విశ్వసనీయత లేదంటున్న జగన్ కు ఏమాత్రం మాన మర్యాదలు లేవని తేలిపోయింది. తన తండ్రి చనిపోయినప్పుడు ఆ చావుని జగన్ రిలయన్స్ యాజమా న్యంపై నెట్టి, నాడు రాష్ట్రంలోతన పార్టీ వారితో నానారభస సృష్టించాడు. రిలయన్స్ పెట్రోలు బంకులు.. మాల్స్ పై దాడిచేయించాడు.

అదే జగన్ తాను ముఖ్యమం త్రి అయ్యాక రిలయన్స్ సంస్థ అధిపతుల్ని అక్కున చేర్చుకున్నాడు. రిలయన్స్ గ్రూప్ వైస్ ఛైర్మన్ అయిన పరిమల్ నత్వానీకి రాజ్యసభ పదవి ఇచ్చాడు. తాను చేసే తప్పు డు పనులకు లాబీయింగ్ చేస్తారనే జగన్ రిలయన్స్ అదినేత ముకేశ్ అంబానీ చెప్పిన నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం కల్పించాడు. రాష్ట్రంలోని పోర్టులు.. ఇతర ఆస్తుల్ని అప్పనంగా అదానీకి కట్టబెడుతున్నాడు.

తన ఇంట్లో, ఒంట్లో లేని విశ్వసనీయత లేని జగన్ .. ఎదుటివారి విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. తన తల్లి, చెల్లి ఎక్కడున్నారో.. వారి విషయం లో తన విశ్వసనీయత ఏమిటో జగన్ చెప్పాలి. సొంత బాబాయ్ ని దారుణంగా గొడ్డలిపోట్లకు బలి చేసిన జగన్ కు విశ్వసనీయత బాగా ఉందా? బాబాయ్ కూతురు సునీత రాష్ట్రంలో తనకు న్యాయంజరగదని.. తనతండ్రిని వారిని శిక్షించడం కోసం సుప్రీంకోర్టు వరకు ఎందుకెళ్లింది.. ఆమె విషయంలో జగన్ విశ్వసనీయత ఏమైంది?

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా ఇతర నిధులు సాధిస్తానన్న జగన్ నేడు మోదీ, అమిత్ షా కాళ్ల దగ్గర తన విశ్వసనీయత నిరూపించుకుంటున్నాడు. తనపై ఉన్న కేసుల నుంచి బయట పడటానికి తన పార్టీకి చెందిన 30 మందిఎంపీలను మోదీకి తాకట్టు పెట్టాడు. డబ్పు పిచ్చితో రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్మిస్తున్న జగన్ రెడ్డి సిగ్గులేకుండా 98శాతం హామీలు నెరవేర్చానని చెబుతున్నాడు. మద్యం అమ్మకాలతో వేలకోట్లు సంపాదిస్తూ.. ఆడబిడ్డల తాళిబొట్లు తెంపుతూ తన ఖజానా నింపుకుంటున్నాడు.

ఇసుక అమ్మకా లతో వేలకోట్లు కొట్టేస్తున్నాడు. జాబ్ క్యాలెండర్ అని చెప్పిన జగన్.. నాలుగున్నరేళ్లలో యువతకు ఎన్ని ఉద్యోగాలిచ్చాడో చెప్పాలి. యువత జీవితాల్ని నాశనం చేస్తూ.. తన సంపాదన కోసం వారిని డ్రగ్స్ , గంజాయికి బానిసల్ని చేయడ మే.. ఈ ముఖ్యమంత్రికి ఉన్న విశ్వసనీయత. వారంలో రద్దు చేస్తా నన్న సీపీఎస్ ను నాలుగున్నరేళ్లు అయినా చేయకపోవడమే జగన్ విశ్వసనీయత. పోలవరం నిర్మాణంపై పూటకో అబద్ధం చెప్పి తప్పించుకోవడమే జగన్ రెడ్డి విశ్వసనీయత. అమరావతి నిర్మాణాన్ని నిలువునా పాతేసి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే జగన్ సాధించిన విశ్వసనీయత.

జగన్ జైల్లో ఉన్నప్పుడు అతని తల్లి, చెల్లి తప్ప ఎవరూ మాట్లాడలేదు. చంద్రబాబు అరెస్ట్ పై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాల నుంచి తప్పించుకోవడానికే జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నాడు
తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి.. ఎలాగైనా చంద్రబాబుని జైల్లో పెట్టాలని జగన్ అధికారంలోకి వచ్చినప్పుడే అనుకున్నాడు. తాను అనుకున్నది చేసి ఇప్పుడు శునకానందం పొందుతున్నాడు. చంద్రబాబుని అక్రమంగా జైలుకు పంపినంత తేలిక కాదు జగన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడమంటే. చంద్రబాబు అరెస్ట్ పై ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ప్రజావ్యతిరేకతతో జగన్ వెన్నులో వణుకుపుడుతోంది.

తాను 16నెలులు జైల్లో ఉన్నప్పుడు తల్లి, చెల్లి తప్ప దేశంలో ఒక్కరూ మాట్లాడలేదు.. ఎందుకంటే జగన్ అవినీతిపరుడని ప్రజలు నమ్మారు కాబట్టి. కానీ నేడు చంద్రబాబు అరెస్ట్ పై ప్రజల నుంచి రోజురోజుకీ ఆందోళనలు.. ఉద్యమాలు ఉధృతమవుతుంటే, వాటినుంచి తప్పించుకోవడానికి అరెస్ట్ విషయం తనకు తెలియ దని నంగనాచి కబుర్లు చెబుతున్నాడు.

దళితులకు రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన ఫలాలు కూడా దక్కకుండా చేసి, న్యాయంగా అమలు చేయాల్సిన పథకాలు రద్దు చేసి, వాళ్లను జగన్ బిచ్చగాళ్లుగా మార్చాడు
మాటల్లో నా ఎస్సీలు… నా ఎస్టీలు…నా బీసీలు.. నా మైనారిటీలు అనే జగన్ నమ్మిన వారినందరినీ నట్టేట ముంచాడు. ఏ వర్గానికి న్యాయం చేయకుండా.. ప్రజలను మోస గించాడు. రాజ్యాంగపరంగా దళితులకు దక్కాల్సిన ఫలాలు కూడా దక్కనీయకుండా చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి వచ్చే ఎన్నికల్లో వాళ్లు తగిన సమాధానం చెబుతారు. దళితులకు అందాల్సిన రూ.30వేలకోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని జగన్ దారిమళ్లించాడు. కార్పొరేషన్లు లేకుండా చేసి వారి స్వయం ఉపాధికి రావాల్సిన రుణాల్ని లేకుండా చేశా డు. తన స్వార్థ ప్రయోజనాలకోసం జగన్ రెడ్డి దళితుల్ని బిచ్చగాళ్లుగా మార్చాడు.

జగన్ కు, వైసీపీనేతలకు చీపుర్లతో సమాధానం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్ లోని సైకోయిజానికి తోడు అతని పిచ్చికూడా బాగా ముదిరింది
ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాడు గానీ.. వైసీపీ వాళ్ల కు ప్రజల్లోకి వెళ్లడానికి ధైర్యం సరిపోవడం లేదు. జగన్ అతని పార్టీ వారికి చీపుర్లతో సమాధానం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్ కు ప్రజలతో పొత్తులేదు.. సంఘవిద్రోహ శక్తులు..నేరగాళ్లతోనే అతని పొత్తు. వాళ్లను అడ్డంపెట్టుకొనే వచ్చే ఎన్ని కల్లో ప్రజల్ని భయపెట్టి మరలా గెలవాలని చూస్తున్నాడు. జగన్ రెడ్డిని ఇన్నాళ్లు సైకో అంటున్నాం.. సైకోయిజానికి తోడు పిచ్చి బాగా ముదిరింది. జగన్ లాంటి పిచ్చికుక్క ను.. అతని కింద ఉండే వీధికుక్కల్ని తరిమి కొట్టడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబుని జైల్లో పెట్టి జగన్ పొందుతున్న ఆనందం అంతా తాత్కాలికమే.” అని ఆనంద్ బాబు స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను వంచించి, వారికి తీరని ద్రోహం చేసిన జగన్.. వారిని తప్పుదోవ పట్టించడానికే మరలా బస్సుయాత్రలంటున్నాడు : కొల్లు రవీంద్ర
నాలుగున్నరేళ్లలో పేదలకు తీరని ద్రోహం చేసిన జగన్ రెడ్డి.. తాను పేదవాడిన ని…పేదల పక్షమని చెప్పడం అతనిలోని ఉన్మాదానికి నిదర్శనమని, వైసీపీ సమా వేశంలో జగన్ వ్యాఖ్యలు విన్నాక అతని కంటే పిచ్చివాడే నయమనిపించాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కొల్లురవీంద్ర ఎద్దేవాచేశారు.

చంద్రబాబు అరెస్ట్ సమయంలో తాను లండన్లో ఉన్నానని, అవినీతి జరిగింది కాబట్టే ప్రతిపక్షనేతను అరెస్ట్ చేశారని జగన్ చెప్పడం అతనిలోని సైకోయిజానికి నిదర్శనమ ని..టీడీపీ అధినేతను అన్యాయంగా జైలుకు పంపడంపై తెలుగురాష్ట్రాలతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా పెల్లుబుకుతున్న నిరసనల్ని తక్కువ చేసి చూపడానికే జగన్ తన పార్టీ సమావేశంలో పాతకథల్నే కొత్తగా వల్లేవేసే ప్రయత్నం చేశాడని రవీంద్ర స్పష్టం చేశారు.

నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాలను పూర్తిగా నాశనం చేసిన జగన్.. నిన్న వైసీపీ సమావేశంలో చేపల వేటకు ముందు కొంగ జపం చేసినట్టు గా మరలా నా ఎస్సీలు.. నా బీసీలు.. నా మైనారిటీలంటున్నాడు. ఆయా వర్గాలన్నీ జగన్ తమకు చేసిన ద్రోహాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాయని.. ఎప్పుడు జగన్ కు బుద్ధి చెబుదామా అని ఎదురుచూస్తున్నాయని రవీంద్ర తెలిపారు.

“ ఎవరు నిజమైన పెత్తందారో ప్రజలకు బాగా తెలుసు జగన్. ప్యాలెస్ ల్లో ఉండే వాడు పేదవాడా.. లక్షలకోట్ల ప్రజలసొమ్ము కొట్టేసినవాడు పేదవాడా.. దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే ధనవంతుడైన ముఖ్యమంత్రి పేదవాడా? చంద్రబాబుని జైల్లో పెట్టి, జగన్ పొందుతున్న వికృతానందాన్ని ప్రజలు గమనిస్తున్నారు.తన ధన దాహానికి ఇసుకను లూఠీ చేస్తూ లక్షలాది కార్మికులను రోడ్డుపాలు చేసిన జగన్ పేదవాడా?కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తూ.. రాష్ట్రంలో వీధికో బెల్ట్ షాపు నడుపుతూ.. తన అక్రమ సంపాదనకోసం ఆడబిడ్డల తాళిబొట్లు తెంచుతున్న జగన్ ఆడబిడ్డల పక్షపాతా?

నాలుగున్నరేళ్లుగా ప్రజల్ని నాసిరకం మద్యానికి బానిసల్ని చేసి, వారి ఇళ్లు.. ఒళ్లు గుల్ల చేసిన జగన్ రెడ్డి.. ‘సురక్ష’ తో వారిని కాపాడతాడా?
నాలుగున్నరేళ్ల పాటు ప్రజల్ని నాసిరకం మద్యానికి బానిసల్ని చేసి, వారి ఇళ్లు..ఒళ్లు గుల్ల చేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు సురక్షతో వారిని కాపాడతాను అంటున్నాడు. కల్తీ మద్యానికి దాదాపు 40వేల మంది చనిపోయాక.. వారి కుటుంబాలన్నీ రోడ్డునపడ్డాక జగన్ కు పేదల ఆరోగ్యం గుర్తొచ్చిందా? ఆరోగ్యశ్రీ పేరుతో దండుకుంటున్నది కాక.. జగనన్న సురక్ష ద్వారా మరింత దోచేయాలన్నదే జగన్ ఆలోచన. బడుగు బలహీన వర్గాలను ఉద్ధరించానంటున్న జగన్ …లక్షా14వేలకోట్ల సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యా యో సమాధానం చెప్పాలి.

సామాజిక బస్సుయాత్ర ద్వారా మరలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను తప్పుదోవ పట్టించాలన్నదే జగన్ దురాలోచన. నాలుగేళ్లలో తాను ఏర్పాటు చేసిన ఉత్తుత్తి కార్పొరేషన్లతో ఎందరికి ఎలాంటి సాయం అందించాడో జగన్ చెప్పాలి. చంద్రబాబు అన్నివర్గాల యువత విదేశాల్లో చదువుకోవాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన విదేశీవిద్య పథకాన్ని రద్దుచేయడమేనా జగన్ కు ఆయావర్గాలపై ఉన్న ప్రేమ? బీసీలకు గతప్రభుత్వం అమలుచేసిన పథకాలను రద్దు చేసినందుకు మరలా బీసీలు జగన్ ను ఆదరించాలా? బీసీలకు చట్టసభల్లో దక్కాల్సిన దాదాపు 16 వేలకు పైగా పదవుల్ని లేకుండా చేయడమేనా జగన్ వారికి చేసిన న్యాయం?

ప్రజలపై పన్నులభారం మోపుతూ… అన్ని ధరలు పెంచడమేనా నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి సాధించిన ప్రగతి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అణగదొక్కేసి, వారికి దక్కాల్సిన సొమ్ముని.. ప్రయోజనాల్ని లేకుండా చేసినందుకు ప్రజలంతా మరలా జగన్ రాష్ట్రానికి కావాలని చెప్పాలా? ఏపీ నీడ్స్ జగన్ కాదు… ఏపీ హేట్స్ జగన్.

ఇదే ప్రజలందరి మాట. వేలాదిమందిపై అక్రమ కేసులు.. ప్రజా నాయకుడిని జైలుకు పంపినందుకు మరలా జగన్ రాష్ట్రానికి కావాలా? దళితుల్ని చంపినవారిని అందలం ఎక్కిస్తున్నందుకు జగన్ మరలా రాష్ట్రానికి కావాలా? రాష్ట్రంలో ఎక్కడా నాలు గేళ్లుగా ఎలాంటి క్రీడలు నిర్వహించని జగన్ సిగ్గులేకుండా మరలా ఆడుదాం ఆంద్రా పేరుతో నాటకాలు మొదలెట్టాడు. కేవలం క్రీడాశాఖలోని నిధుల్ని దోచుకోవడానికే జగన్ ఆడదాం.. పాడదాం అంటున్నాడు. రాష్ట్ర ప్రజలంతా ‘we don’t need Jagan mohan reddy, we hate Jaganmohan reddy’ అంటున్నారు.” అని రవీంద్ర తేల్చి చెప్పారు.

LEAVE A RESPONSE