సమాచార శాఖ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉద్యోగుల ఆరోగ్య (EHS) పధకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సబ్యులకు ఉచిత వైద్య పరీక్షలకు ఒక రోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ కుమార్ రెడ్డి తెలిపారు.

బుధవారం ఉదయం కమీషనర్ వారి కార్యాలయ కాన్ఫెరెన్స్ హాల్ నందు డా. సంజయ్ కృష్ణ ఆధ్వర్యంలో డా. ప్రియాంక బృదం వారిచే నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో సమాచార శాఖ ఉద్యోగులు దాదాపు 110 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని పలు ఆరోగ్య సమస్యలుపై అవసరమైన వైద్య పరీక్షలతో పాటు వైద్య సహాయం అందించడం జరిగింది. ఈ శిబిరంలో దంత సమస్యలను డా. ప్రియాంక, దృష్టి లోపoనకు సంబంధించి కంటి పరీక్షలు డా. భూషణం, సాంకేతిక నిపుణులు కాశీరాజు, రాజేష్ లు నిర్వహించారు. కంటి పరీక్షల అనంతరం తక్కువ ధరకు కళ్ల జోడు, అద్దాలు అందజేశారు. హాస్పిటల్ నిర్వాహుకులైన మేనేజర్ రాజశేఖర రెడ్డి పర్యవేక్షణలో ఈ శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణ లత, సంయుక్త సంచాలకులు కిరణ్ కుమార్, కస్తూరి బాయి తేళ్ల పర్యవేక్షణలో నిర్వహించారు.

Leave a Reply