– పంటలబీమా, గిట్టుబాటుధర ఏదీలేక రైతులురోడ్డునపడే పరిస్థితికి వచ్చారు. ఆత్మహత్యల్లో, రైతుఅప్పుల్లో ఏపీ రైతులదే దేశంలో అగ్రస్థానం
• రైతులకు అందించాల్సిన పంటలబీమా సాయాన్ని జగన్ , తనపార్టీ వారికి దోచిపెడుతున్నాడు.
• తాడిపత్రి ఎమ్మెల్యే 14లక్షల పంటలబీమా కాజేయడమే అందుకు నిదర్శనం. పంటలబీమా సహా, ఇతరపథకాల లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ఎందుకు రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శించడంలేదు?
– మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు
నాలుగేళ్లలో రైతుల్ని నిలువునా ముంచేసి, వారికి దక్కాల్సిన పంటలబీమాసొమ్ము, ఇన్ పుట్ సబ్సిడీ, గిట్టుబాటుధర వంటివాటిని తనపార్టీవారికి దోచిపెడుతున్న జగన్మోహన్ రెడ్డికి రైతుదినోత్సవం పేరుఎత్తే అర్హత, హక్కులేవని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
“ రైతుదినోత్సవం జరిపే అర్హత, హక్కు ఈ ముఖ్యమంత్రికి లేవు. రైతులసాయం అనే దాన్ని మాటలకుతప్పచేతల్లో అమలుచేయని అసమర్థుడు జగన్. రైతులకు అందాల్సి న పంటలబీమాసొమ్ముని తనపార్టీ ఎమ్మెల్యేలకు దోచిపెట్టాడు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ.14లక్షల పంటలబీమా సొమ్ముకాజేశాడు? చీనీతోట వేసిన రెండేళ్లకే, తోటదెబ్బతిన్నదని పంటలబీమా పరిహారం కొట్టేశాడు. తోట దెబ్బతి న్నదో లేదో పరిశీలించకుండానే అధికారులు అర్హులైనవారికి అందాల్సిన పంటనష్టం పరిహా రాన్ని అతనికి దోచిపెట్టారు.
ప్రభుత్వసాయం, పథకాలు పొందే రైతులజాబితాను ఎందుకు రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శించరు?
పంటలబీమాపరిహారం, గిట్టుబాటుధర పొందే రైతులజాబితాను ప్రభుత్వం ఎందుకు రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శించడంలేదు? అధికారపార్టీనేతలు, కార్యకర్తలు రైతుల ముసుగులో కొట్టేసిన ప్రభుత్వసొమ్ము విషయం బయటకు పొక్కుతుందనే వాస్తవాలు ప్రజలముందు ఉంచడంలేదా? రైతులు పండించే ప్రతిపంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానని ఎన్నికలకు ముందు జగన్ హామీఇచ్చాడు. దానికోసం ఆయన ఏర్పాటుచేస్తాన న్న రూ.3వేలకోట్ల ధరలస్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నిస్తున్నాం.
రైతులవిషయంలో జగన్ అనుసరించిన అసమర్థవిధానాలు వారిని రోడ్డునపడేశాయి. వ్యవసాయం భార మై, పంటలకు గిట్టుబాటుధరలేక రాష్ట్రంలో 92.5శాతం రైతుకుటుంబాలు అప్పుల్లో మునిగిపోయాయి. ఒక్కో రైతుకుటుంబంపై రూ.2.45లక్షలకు పైగా అప్పుంది. జగన్ రెడ్డి రైతువ్యతిరేకవిధానాలతో, 4ఏళ్లలో రాష్ట్రంలో 3వేలమంది అన్నదాతలు ఉసురు తీసుకున్నారు.
రైతులకు అండగా ఉన్నాను.. వ్యవసాయరంగా న్ని ఉద్ధరిస్తున్నాను.. మాది రైతుప్రభుత్వం అంటున్న జగన్ ఉపన్యాసాలు ఆచరణలో అమలుకావడంలేదు. జగన్ చెబుతున్న రైతుసంక్షేమం పత్రికల్లోని ప్రకటనల్లోతప్ప, క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడంలేదు.
పంటలబీమా సాయం ఎగ్గొట్టడానికే జగన్ రెడ్డి వాతావరణ ఆధారిత బీమా, దిగుబడి ఆధారిత బీమా అని మెలిక పెట్టాడు. కేంద్రప్రభుత్వం అమలుచేసే ప్రధానమంత్రి ఫస ల్ బీమాయోజన సాయంతప్ప, జగన్ ప్రభుత్వం అదనంగా అర్హులైనరైతులకు రూపాయి ఇవ్వడంలేదు.
పంటలబీమా సొమ్ము రైతులకు ఎగ్గొట్టడానికే జగన్, వాతావరణఆధారిత, దిగుబడి ఆధారిత పంటలబీమా అని మెలికపెట్టాడు. 9 జిల్లాల్లో వాతావరణ ఆధారిత బీమా కింద ఒక్కరైతుకి రూపాయి అందలేదు. 21జిల్లాల్లో దిగుబడి ఆధారితబీమా కింద అన్నదాతలకు ఇచ్చింది అరకొరే. ఈ క్రాప్ లో తప్పుడు వివరాలు నమోదుచేసి, వైసీపీ కార్యకర్తలే రైతులసొమ్ముని దిగమింగారు. రైతులఆత్మహత్యల్లోనే కాకుండా అప్పుల్లోకూడా ఏపీ రైతులే దేశంలో అగ్రస్థానంలో ఉన్నారు.
జాతీయగణాంక సర్వే ప్రకారం రాష్ట్రంలోని ఒక్కోరైతుకుటుంబంపై రూ.2,45,554ల అప్పు ఉంది. జగన్ చెబు తున్న రైతుసంక్షేమం, వ్యవసాయరంగ ఉద్ధరణ అంతా పత్రికాప్రకటనలకే పరిమిత మైంది. పంటలబీమా పరిహారంపై జగన్ అతనిప్రభుత్వం తప్పుడులెక్కలు చెబుతోంది. 10లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే, వైసీపీప్రభుత్వం కేవలం 1117కోట్లరూపాయ లు మాత్రమే చెల్లించింది. 7 జిల్లాల్లో కోటిలోపే పరిహారం అందింది. రైతుల్ని మోసగించ డానికే పంటలబీమా పరిహారం చెల్లింపుల్లో వాతావరణఆధారిత బీమా, దిగుబడి ఆధా రిత బీమా అనే మెలికపెట్టారు.
జిల్లాలవారీగా సాగువిస్తీర్ణం, దెబ్బతిన్నపంటల వివరా లు రహస్యంగా ఉంచుతున్నారు. చిత్తూరు, అన్నమయ్య, గుంటూరు జిల్లాల్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమాయోజన (దిగుబడిఆధారిత పంటలబీమా)కు అసలు అర్హులే లేరని ప్రభుత్వం తేల్చింది. 21జిల్లాల్లో వాతావరణ ఆధారిత బీమాకింద ఒక్కోజిల్లాకు రూ.50కోట్లకు మించి పరిహారం రైతులకు అందలేదు. నెల్లూరు, కృష్ణా, అనకాపల్లి, విజయనగరం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కోజిల్లాకు కోటిరూపాయలలోపే పరిహా రం ఇచ్చారు.
రైతులు పెట్టిన పెట్టుబడి లక్షల్లో ఉంటే, జగన్ ఇచ్చేసాయం వందల్లో ఉంటోంది
2021-22లో రాష్ట్రవ్యాప్తంగా పత్తిరైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి ఆధారిత బీమాకింద రైతులకు రూ.189.86కోట్లు కేటాయించి, రూ.120కోట్లే రైతులకు అందించారు. వాతావరణ ఆధారిత బీమాకింద రూ.148.55కోట్లు కేటాయించి, 103 కోట్లు మాత్రమే, ఆ మొత్తంకేవలం కర్నూలు జిల్లాకే కేటాయించారు. ఈ విధంగా రైతు ల్ని వంచిస్తున్నారు.
ఈ క్రాప్ నమోదులో తప్పుడు వివరాలునమోదుచేసి వైసీపీనేత లు , కార్యకర్తలకే మేలుచేస్తున్నారు. లక్ష్మీరెడ్డి అనేరైతు ఎకరంన్నరలో వరిసాగుచేస్తే అతనికి కేవలం రూ.36ల పరిహారమిచ్చారు. మరోచోట రూ.32లు ఇచ్చారు. ఇలా రైతులు పెట్టినపెట్టుబడి వేలు, లక్షల్లో ఉంటే, జగన్ ఇచ్చిన సాయం వందలు, పదుల్లో ఉంది. జగన్ రెడ్డి నిజంగా అర్హులైన రైతులకు న్యాయంచేస్తే వారి వివరాలను రైతుభరో సా కేంద్రాల్లో ఎందుకు ఉంచడంలేదు?
చంద్రబాబు అన్నదాతలపక్షాన గళమెత్తినప్పుడే జగన్ కు రైతులు గుర్తొస్తారు
ఉత్తరాంధ్ర రైతులకు బీమాపరిహారంలో ముఖ్యమంత్రి మొండిచెయ్యి చూపించారు. పంటలబీమా సాయం మొత్తం రైతులు రూపాయి కట్టకుండా మొత్తం తన ప్రభుత్వమే కడుతుందని చెప్పిన జగన్, ఆచరణలో మాత్రం కేవలం కేంద్రప్రభుత్వమిచ్చే బీమా సొమ్మునే రైతులకు ఇచ్చిచేతులు దులుపుకుంటున్నాడు. చంద్రబాబు పంటలబీమా కింద ఐదేళ్లలో రూ.4,007కోట్లు రైతులకు చెల్లిస్తే, జగన్ రెడ్డి నాలుగేళ్లలో కేవలం రూ.1965కోట్లు మాత్రమే ఇచ్చాడు.
జగన్ రెడ్డి రైతువ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఇప్పటికే 3వేలమంది అన్నదాతలు ఉసురుతీసుకున్నారు. చంద్రబాబు రైతులకోసం అసెంబ్లీలో పోడియంవద్దకూర్చొని నిరసనతెలిపితే, రాత్రికి రాత్రి రూ.590కోట్లు పంటల బీమా ప్రీమియంకోసం చెల్లిస్తున్నట్టు జీవో ఇచ్చారు. 2022-23 ఖరీఫ్ లో రాష్ట్రంలో ఒక్క రైతుకికూడా జగన్ రెడ్డి పంటలబీమా పరిహారం ఇవ్వలేదు.
చిలకలూరిపేటలో పంటనష్టంపోయిన రైతుల్ని పరామర్శించడానికి చంద్రబాబు వస్తున్నాడని తెలిసి, స్థానిక మంత్రి ఒకరోజుముందు హడావుడిగా కలెక్టర్ ను పక్కనపెట్టుకొని రైతులవద్ద కు వెళ్లింది. తరువాత రైతులకు ఎలాంటి పరిహారం అందిందిలేదు. ఉభయగోదావరి జిల్లాల్లో అకాలవర్షాలకు ధాన్యంతడిస్తే, చంద్రబాబు వెళ్లేవరకు జగన్ స్పందించలేదు.
ప్రతిపక్షనేత వస్తున్నాడని తెలిశాకే హడావుడిగా ధాన్యంకొనుగోళ్లు జరిపి, రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా చేతులెత్తేశారు. జగన్ రెడ్డి రైతువ్యతిరేకవిధానాల తో నష్టపోయిన ప్రతిరైతుకి టీడీపీప్రభుత్వం రాగానే న్యాయంచేస్తామని చంద్రబాబు ఇప్పటికే భరోసా ఇచ్చారు. రైతుభరోసాకేంద్రాల ముసుగులో రైతుల్ని నిలువునా దగాచేసిన ముఖ్యమంత్రికి రైతుదినోత్సవం పేరెత్తే అర్హత లేదు.” అని పుల్లారావు తెలిపారు.