పేదోళ్ల భూములు కొట్టేయడానికే జలగన్న“భూభక్ష…”

-ఇవి సర్వేరాళ్లే మీ అరాచక సర్కారుకు సమాధిరాళ్లు!!
-నారా లోకేష్

ఇవి యలమంచిలి నియోజకవర్గం తోటాడ వద్ద జగనన్న భూరక్ష పేరుతో సిద్ధంగా ఉన్న హద్దురాళ్లు. పరిపాలనకంటే స్కిక్కర్లు, బొమ్మలకే పెద్దపీట వేసే జగన్ రెడ్డి సర్వేరాళ్లను సైతం వదలకుండా వాటిపై తమ పేరు వేసుకున్నాడు. వాస్తవానికి ఆ పథకానికి జగనన్న భూభక్ష అని పేరు పెడితే కరెక్టుగా సరిపోయేది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసిలకు చెందిన పేదలు, ప్రభుత్వ భూములు, ఆలయాల భూములు గుర్తించి వాటిని కొట్టేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్. ముందు సర్వే అంటారు, తర్వాత రాళ్లు అంటారు, చివరిగా ఈ భూమి మాదే అంటారు. కావాలంటే రాళ్లపై మా జలగన్న బొమ్మ ఉంది చూసుకోండని చెబుతారు. ఇటువంటి సర్వే రాళ్లే మీ అరాచక ప్రభుత్వానికి సమాధిరాళ్లు కాబోతున్నాయి… రాసి పెట్టుకో జగన్మోసపురెడ్డీ?!

Leave a Reply