ఏపీకి మరో తుపాను ముప్పు

మొన్నటి వరకు ‘మిచౌంగ్’ తుపాన్‌తో ఏపీ ప్రజలు అతలకులం అయ్యారు. ఇక తుపాన్ అనంతరం ఉష్ణగ్రతలు కూడా బాగా తగ్గి.. చలి ప్రభావం మరింత పెరిగింది. అక్కడక్కడ పొగ మంచుతో రహదారులు మూసుకుపోవడంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీకి మరోసారి మరోసారి తుఫాన్ రాబోతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది.

దీనివల్ల సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాల పైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇక వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. వర్షాల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీల తక్కువగా నమోదు కావడంతో.. అక్కడ ప్రజలు చలి తీవ్రతకు గజగజ వణుకుతున్నారు.

Leave a Reply