నలుగురు వైసీపీ కార్పొరేటర్లు సస్పెన్షన్

విశాఖ దక్షిణ నియోజకవర్గానికిచెందిన నలుగురు కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జీవీఎంసీ 29వ వార్డు కార్పొరేటర్ ఊరుకూటి నారాయణరావు, 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ జైన్ కుమార్, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకీరామ్ లను సస్పెండ్ చేశారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.

Leave a Reply