ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో కలిసి రాలేదు

8

-మాతోనే జనసేన కలిసి రావడం లేదనేది మా ఆరోపణ
-మేం వైకాపాతో ఉన్నామనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు
-మేం వైకాపాతో ఉన్నామనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు
-జనసేనతో కలిసి ఉన్నాం. కానీ కలిసున్నా లేనట్టేనని భావిస్తున్నాం
-భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్‌
-ముగిసిన భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం

విజయవాడ: పదాధికారుల సమావేశంలో పార్టీ బలోపేతం చేసే అంశంపైనే చర్చించాం. గతంతో పోల్చుకుంటే భాజపాకు వచ్చిన ఓట్ల శాతం పెరిగింది.విశాఖలో ఓట్ల శాతం తగ్గింది. కానీ మిగిలిన చోట్ల ఓట్ల శాతం పెరిగింది. జనసేనతో కలిసి ఉన్నాం. కానీ కలిసున్నా లేనట్టేనని భావిస్తున్నాం. జనసేనతో కలిసి భాజపా ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉందని నమ్ముతారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో కలిసి రాలేదు. తమ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని పీడీఎఫ్ చెప్పుకుంది. కానీ ఆ విషయాన్ని ఖండించమని జనసేనను కోరినా చేయలేదు. మాతోనే జనసేన కలిసి రావడం లేదనేది మా ఆరోపణ. మేం వైకాపాతో ఉన్నామనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. భాజపా హైకమాండుకు చెప్పే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని వైకాపా ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విషయాన్ని ప్రజలు నమ్మారని భావిస్తున్నాం. వైకాపా వేసిన ఈ అపవాదును తుడుచుకునే ప్రయత్నం చేస్తాం.మే నెలలో రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేస్తాం. పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు ఉన్నాయి. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుంది.