జిన్నా టవర్ పేరు మార్చాల్సిందే

– గుంటూరు బీజేపీ నేతల నిరసన

జిన్నాటవర్ పేరు మార్చాలంటూ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా అనురాధ గారిని వారి కార్యాలయంలో కలసి వినతిపత్రం అందజేసిన కేంద్ర కార్మిక సంక్షేమబోర్డు చైర్మన్ బిజెపి ఎస్సి మోర్చా ఇంచార్జ్ వల్లూరు జయప్రకాష్ నారాయణ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మరియు బిజెపి నేతలు.

ఈసందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, స్వతంత్ర భారతం అమృతోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సమయమిది. ఇలాంటి సమయంలో జిన్నా వంటి వేర్పాటు వాదుల పేరిట చిహ్నాలు ఉండటం అవసరమా?స్వాతంత్య్ర పోరాట సమయంలో జిన్నా మత విద్వేషాలు రెచ్చగొట్టారు.

పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడకు వెళ్లిన వారిని జిన్నా హత్య చేయించారు. జిన్నా టవర్ పేరు మార్చి అబ్దుల్ కలాం పేరు పెట్టాలి. ఇదే డిమాండ్ తో కమిషనర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చాం.

కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిపి ఏకగ్రీవంగా ఆమోదించాలి. దేశం కోసం పాటుపడిన కలాం వంటి వారి పేర్లు పెట్టడం సముచితమని బిజెపి భావన. గతంలో కూడా జిన్నా టవర్ పేరు మార్పుపై చర్చ జరిగింది.దేశం కోసం ప్రాణాలు అర్పించిన హమీద్ పేరు పెట్టాలని గుంటూరు నగరపాలక సంస్థలో గతంలో తీర్మానం కూడా చేశారు.

జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ..జిన్నా టవర్ గుంటూరు నగరానికి ఆత్మగౌరవానికి మాయని మచ్చ.దేశ విభజన చేసి మారణహోమం సృష్టించిన వ్యక్తి పేరు మనకు అవసరమా?టవర్ పేరు మార్చకపోతే మేం కర సేవకులుగా మారతాం.బాబ్రీ మసీదు విషయంలో ఏం జరిగిందో చూశారు. జిన్నా టవర్ ను పడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. విద్వేషాలకు తావు లేకుండా టవర్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలి.

ఈ కార్యక్రమంలో పాలపాటి రవికుమార్,రాచుమల్లు భాస్కర్,కుమార్ గౌడ్,నీలం ప్రసాద్,భీమినేని చంద్రశేఖర్,వనమా నరేంద్ర, మైల హరికృష్ణ,పాలిశెట్టి రఘు, వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply