Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ సహకారంతో గల్ఫ్ లో 12 మందికి ఉద్యోగాలు

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలోని ఎంపవర్మెంట్ సెంటర్ సహకారంతో ఉచితంగా శిక్షణ పొందిన 12 మంది విద్యార్థులు దుబాయ్ లో ఎలక్ట్రీషియన్లుగా ఉద్యోగాలు పొందారు. వీరికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు చేతులు మీదుగా జాబ్ ఆఫర్ లెటర్స్ ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయం లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో అందజేశారు.

తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యం లో ఎన్నారై టీడీపీ సహకారంతో పనిచేస్తున్న ఎంపవర్మెంట్ సెంటర్ ఇప్పటికే వేలాది మంది విద్యార్థులకు అనేక విభాగాలలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం తో పాటు ఉద్యోగాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఐటిఐ చదివిన 12 మంది విద్యార్థులు గత మూడు నెలల కాలంగా టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్లో ఉచితంగా ఎలక్ట్రీషియన్ విభాగంలో శిక్షణ పొందారు.

వీరికి తాజ్ అల్ సఫా టెక్నికల్ సర్వీసెస్ అనే సంస్థ టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ కార్యాలయాన్ని సందర్శించి ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఉద్యోగాలు కల్పించింది. ఉద్యోగాలు పొందిన వారిలో సీహెచ్ హరినాధ్(రాజోలు), టి పవన్ కుమార్(మంగళగిరి), వై దశరథ్(మంగళగిరి), ఈ హరీష్ బాబు(గుంటూరు), ఈ గుణ శేఖర్(నరసాపురం), ఎండీ ఉస్మాన్ సోహైల్(గుంటూరు), ఎం పృథ్వి రాజ్(తిరువూరు), పి సాంబశివ రావు(బాపట్ల), ఎస్కె వలి(బాపట్ల), పి మురళి(చీరాల), ఎస్ అబ్దుల్ సలాముద్దీన్(విజయవాడ), ఎండీ అస్లాం(మంగళగిరి) ఉన్నారు.

sతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, బ్రాహ్మణా సాధికారత సంస్థ కో-ఆర్డినేటర్ కె బుచ్చిరాంప్రసాద్ టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ ప్రతినిధులు డి వి రావు, అధికారి తో పాటు తాజ్ అల్ సఫా టెక్నికల్ సర్వీసెస్ ఫణి కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE