జనసేన పార్టీలో చేరికలు

ఉమ్మడి అనంతపురం జిల్లాకు చేసిన పలువురు ప్రముఖులు సోమవారం రాత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బ్లూ మూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్ మంచి శివశంకర్, అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షులు గువ్వల శ్రీనివాసులు, కొమ్మినేని చిన్నపురెడ్డిలు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. వారికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో సమర్ధంగా పని చేయాలని సూచించారు.

Leave a Reply