– లక్ష ఎకరాలకు కూడా సాగునీరు విడుదల చేయలేదు
– రైతుల కోసం పంటలకు ఇవ్వాల్సిన 10 టీఎంసీల నీటిని వృథాగా వదిలివేశారు
– 30 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ప్రాజెక్టును రిడిజైన్ పేరుతో లక్షా 30 వేల కోట్లకు పెంచారు
– మాజీ డీజీపీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ ప్రసాద్
కాళేశ్వరం ప్రాజక్టు వండర్ కాదు.. ఇంజినీరింగ్ బ్లండర్.మేడిగడ్డ పిల్లర్లు కుంగటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలి.నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.2014 లో రూ. 30 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ప్రాజెక్టును రిడిజైన్ పేరుతో లక్షా 30 వేల కోట్లకు పెంచారు.అక్టోబర్ 21న కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక బ్యారేజీ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రాత్రికిరాత్రే 10 టీఎంసీల నీటిని వదిలివేశారు.రైతుల కోసం పంటలకు ఇవ్వాల్సిన 10 టీఎంసీల నీటిని వృథాగా వదిలివేశారు.ప్రజల పన్నులతో కట్టిన ప్రాజెక్టును.. నిధుల పేరుతో దోచుకున్నారు.ప్రతి ఎకరాకు ఆదాయం రూ. 40 వేలు ఉంటే.. మెయింటనెన్స్ కు రూ. 80 వేలు ఖర్చవుతోంది.
రైతులకు నీళ్లు ఇస్తున్నామని చెప్పి లక్షకోట్ల నిధులను కాజేశారు.రైతుల పేరు చెప్పి ఒక కుటుంబానికి నిధులు సమకూర్చునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారు.ఇప్పుడు అవే డబ్బులతో దేశ వ్యాప్తంగా కొన్ని పార్టీలకు ఎన్నికల ఖర్చులకు డబ్బులిస్తామంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని తప్పిదాలపై, సంబంధిత ఇంజనీర్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు..? బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.ప్రాజెక్టును తానే డిజైన్ చేశానని చెప్పుకున్న కేసీఆర్.. అనేక తప్పిదాలకు కారణమయ్యారు.
లక్ష కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయాయనేది ప్రజలకు సమాధానం చెప్పాలి.40 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తోందని చెప్పుకున్న కేసీఆర్.. 20లక్షలు కాదు.. కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగునీరు విడుదల చేయలేదు. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయల రుణాలు చేసింది. మొదట మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోయింది, తర్వాత అన్నారం దగ్గర సరస్వతీ బ్యారేజీ దగ్గర బుంగలు రావడంతో మొత్తం 10 టీఎంసీల నీటిని వృథాగా వదిలేశారు.ఇప్పుడు పంటలకు ఒక్కచుక్క నీరందించే పరిస్థితి లేదు. ప్రాజెక్టులో తప్పిదాలు, వైఫల్యాలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.