సైకో జగన్ పాలనను కళ్లకు కట్టినట్లు రాసిన శారద

– ‘‘నవ్యాంధ్ర రాష్ట్రం బాబు రావాలి బాగు చేయాలి రాష్ట్ర భవిష్యత్ మారాలి’’ పుస్తక ఆవిష్కరణలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి : ప్రముఖ రచయిత్రి మండల శారద రచించిన ‘‘ నవ్యాంధ్ర రాష్ట్రం బాబు రావాలి బాగు చేయాలి రాష్ట్ర భవిష్యత్ మారాలి’’ పుస్తకాన్ని మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు సత్తెనపల్లి లో ఆవిష్కరించారు. ప్రజలకు కనువిప్పు కలిగించేందుకు రచయిత శారద చేసిన ప్రయత్నాన్ని కన్నా అభినందించారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి పుస్తకాలు మరిన్ని రాయాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను రచయిత కళ్లకు కట్టినట్లు రాశారని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలని సూచించారు.

ఒక సైకో సీఎంగా ఉంటే ఆ రాష్ట్రం ఎంత అధోగతిపాలవుతుందో చక్కగా వివరించారు. సీఎం జగన్ కేవలం తన సంస్థలు, తన చుట్టూ ఉన్న కొందరికి దోచిపెట్టడానికే ప్రయత్నిస్తున్నారన్న వాస్తవం ఈ పుసక్తం చదివితే అర్ధమవుతుందన్నారు.

నవరత్నాలు పేరుతో ఒకచోత్తో పది రూపాయలు ఇచ్చి, మరో చేత్తో వందరూపాయలు తీసుకునే దుర్మార్గ పాలనను ఈ పుస్తకం ఆవిష్కరించిందని కొనియాడారు. చంద్రబాబునాయుడు 14 ఏళ్ల పాలనలో జరిగిన సంక్షేమ-పథకాల గురించి రచయిత శారదను కన్నా అభినందించారు.

ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు వై వి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి చౌటా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి యేలినీడి రామస్వామి, మండల పార్టీ అధ్యక్షులు ఆళ్ళ మరేశ్వరరావు, ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న నాయకులు మండల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply