జగన్ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు

– హిందువులను పూర్తిగా నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది
– ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాలకు బీజేపీ పూర్తి మద్దతు
– జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ

‘‘ ఆత్మకూరు ఘటనకు వ్యతిరేకంగా ప్రజా నిరసన సభ జరుగుతుంది. ఆత్మకూరులో తొంభై శాతం హిందువులున్న ప్రాంతంలో హిందువుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా మసీదు నిర్మాణం చేపట్టారు. మసీదు నిర్మాణానికి అనుమతులు లేవు. రాష్ట్రంలో హిందువులకు,హిందూ దేవాలయాలకు రక్షణ కరువైంది’’ అని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు.

కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో మతం ముసుగులో బీజేపీ కార్యకర్తల పై దాడికి నిరసనగా బిజెపి తలపెట్టిన ప్రజా నిరసన సభ రాష్ట్ర వ్యాప్తంగా175 నియోజకవర్గాలలో వర్చువల్ విధానంలో వీక్షించడం
kanna2 జరిగింది.బిజెపి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో కర్నూలు లో జరుగుతున్న జిజెపి సమావేశాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సంబంధించి బ్రాడిపేటలోని శ్రీ లక్ష్మీ థియేటర్ లో వర్చువల్ విధానంలో బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం అహల్య నర్సింగ్ హోమ్ సమావేశము హాల్ నందు వర్చువల్ విధానంలో వీక్షించిన మాజీమంత్రి శనక్కాయల అరుణ, బిజెపి సీనియర్ నాయకులు స్టేట్ లీగల్ సెల్ ఇన్చార్జ్ జూపూడి రంగరాజు, శనక్కాయల ఉమాశంకర్ వీక్షించారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. హిందువులను పూర్తిగా నాశనం చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 170 పైగా దేవాలయాలపై దాడులు జరిగితే అరెస్టులు చేసిన దాఖలాలు లేవు. పోలీసుల సాయంతో జిల్లా అధ్యక్షుడు ఘటన ప్రాంతానికి వెళ్ళారు. పిఎఫ్ఐ ఆధ్వర్యంలో పోలీసులు పై దాడి చేశారు. జగన్ పాలనకు వచ్చినప్పటి నుండి హిందూ సమాజాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఫ్యాక్షనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి
kanna ముఖ్యమంత్రి అవ్వడంతో, వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తప్ప ఇంకేమీ ఉండకూడదని అనుకుంటున్నారు. అరాచక పాలన చేస్తున్నారు. పేకాట క్లబ్ లు, మద్యం అమ్ముకోవటం, సినిమా టికెట్స్ అమ్ముకోవటం,మాంసం దుకాణాలు నిర్వహణ వంటివి చేస్తున్నారు. ఇటువంటి పాలన అవసరమా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలి. 12 లక్షల కోట్ల రూపాయలపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. డబ్బులు పంచుతున్నాం.. నాకు ఉన్న ఓట్లు నాకున్నాయని అనుకుంటున్నారు. వారం రోజులలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చాడు. ఇప్పటికైనా ఉద్యోగస్తులు జగన్ మోస పూరిత పాలనను గమనించారని భావిస్తున్నాం.ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాలకు బీజేపీ పూర్తి మద్దతుగా ఉంటుంది అని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో బిజెపి స్టేట్ కోపరేటివ్ సెల్ కన్వీనర్,ప్రోగ్రాం ఇంచార్జ్ వనమా నరేంద్ర,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఈమని మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శులు రాచుమల్లు భాస్కర్,అప్పిశెట్టి రంగా,కుమార్ గౌడ్,లీగల్ సెల్ కన్వీనర్ భీమినేని చంద్రశేఖర్,ఈదర శ్రీనివాస రెడ్డి,చాపల సురేష్ బాబు,ఉయ్యాల శ్యాంవరప్రసాద్, అనుమోలు ఏడుకొండలు గౌడ్,ఎస్ కె భాష,ఆవుల రామకోటేశ్వరరావు,సురేష్ జైన్,దారా అంబేద్కర్, దర్శనం శ్రీనివాస్,దొడ్డి నాగరాజు,దత్తప్రసాదు కరుణశ్రీ,లక్ష్మీ కుమారి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply