– చంద్రబాబుకు రైతులంటే అమరావతి రైతులే
– చంద్రబాబు దిగజారిపోడానికి ఇక మెట్లు కూడా లేవు
– ఆయనదంతా ఈట్ పాలిటిక్స్…డ్రింక్ పాలిటిక్స్
– ధాన్యం కొనుగోలు పారదర్శకంగా మార్చింది జగన్‌గారే
– చంద్రబాబు మిల్లర్లకు దోచిపెట్టాడు
– నొక్కుడు, బొక్కుడూ చూసే ప్రజలు బాబును ఇంటికి పంపారు
– ఆయన నొక్కుడుపై కమిటీ వేస్తే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్న ఘనుడు
– టీడీపీని ఒక డ్రామా కంపెనీగా నడుపుతున్నాడు
– నువ్వొక పెద్ద సైకో…నీ కొడుకో పిల్ల సైకో అని మేమూ అనగలం
– మాకు సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాం
– పెత్తందార్ల వైపు టీడీపీ..పేదలవైపు వైఎస్సార్సీపీ
మాజీ మంత్రి కురసాల కన్నబాబు
రైతు బాంధవుడిలా చంద్రబాబు కొత్త వేషం వేశాడు:
– పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి కరుణించడం లేదు. వాతావరణం అనుకూలించడం లేదు.
– గోదావరి డెల్టాలో ఒక ఎకరా కూడా ఎండిపోకూదని మార్చిలోనే ముఖ్యమంత్రి గారు సీలేరు నుంచి సాగునీరు అందించారు.
– ఈ క్రమంలో రెండో పంట బాగా పండింది.మంచి దిగుబడులు కూడా వస్తున్నాయనుకున్న తరుణంలో వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి.
– ప్రకృతిని కంట్రోల్ చేయడం మానవ మాతృలకు సాధ్యం కాదు.
– మొత్తం యంత్రాంగాన్నంతటినీ అప్రమత్తం చేసి ఎక్కడా రైతు ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా చూడాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
– దీనికోసం ప్రత్యేకంగా అధికార బృందాలను ఏర్పాటు చేశారు. మంత్రులు, శాసనసభ్యులు అందరూ ఫీల్డ్‌లో ఉండాలని ఆదేశించారు.
– ఈ లోపే చంద్రబాబు రైతు బాందవుడిలా కొత్త వేషం వేసుకుని ఊళ్లోకి దిగిపోయాడు
– ఈ రాజకీయ రాబందుకు రైతులు పాడైపోతున్నారంటే పండుగ చేసుకున్నట్లుంది
– పొలాల్లో తిరిగేస్తున్నానంటూ టీడీపీ కార్యకర్తలను వెంటేసుకుని జగన్ గారిపై శాపనార్ధాలు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు.
– చంద్రబాబు వాడే బాషను చూస్తే అతను ఇంతకంటే దిగజారిపోడానికి మెట్లు ఏమీ లేవు.
టీడీపీని ఒక డ్రామా కంపెనీగా నడుపుతున్నాడు:
– చంద్రబాబు టీడీపీని ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక డ్రామా కంపెనీలా నడుపుతున్నాడు.
– జాతరలు వస్తే డాన్స్ కంపెనీలు దిగిపోయినట్లు దిగిపోయి పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నాడు.
– ముఖ్యమంత్రి గారిపై ఆయన వాడే బాష దిగజారుడుతనంగా మారింది.
– నోటికి ఏమి వస్తుందో అతనికే తెలియడం లేదు.
– ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చాలా మంది చేశారు కానీ ఇంత దిగజారుడు బాష వాడిన వ్యక్తి చంద్రబాబు ఒక్కడే
– దరిద్రుడు, సైకో అంటున్నాడు. ఇదే మాట ప్రజల్ని అడిగితే దాన్ని నీకే అన్వయిస్తారు.
– చంద్రబాబు దరిద్రం పట్టే కదా రాష్ట్రం ఐదేళ్లు కరువుతో అల్లాడిపోయింది.
– ఆయన వ్యవహార శైలితో దరిద్రం పట్టే కదా రైతులు అల్లాడిపోయారు.
– నీ దరిద్రం పట్టే కదా అమరావతిని రియల్ ఎస్టేట్ కంపెనీలా చేసి చివరికి రాజధాని లేకుండా చేశావ్
– చంద్రబాబులా దరిద్రంగా పరిపాలించిన వారు గతంలో ఎవరైనా ఉన్నారా..?
జగన్ గారి దెబ్బకి తేరుకోలేక చంద్రబాబుకు ఈ ఫ్రస్టేషన్:
– చంద్రబాబుకు తాను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియడం లేదు..ఏం ఉచ్చరిస్తున్నాడో తెలియడం లేదు…పూర్తి ఫ్రస్టేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
– ఆయన ఫ్రస్టేషన్‌కి ఇద్దరే ఇద్దరు కారణం..ఒకరు రాజకీయంగా ఊపిరి సలపకుండా చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి గారు..రెండోది తన భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తున్న కొడుకు లోకేశ్.
– జగన్ గారు కొట్టిన దెబ్బకు తేరుకోలేకపోతున్నాడు. ఎక్కడకు వెళ్లినా పట్టుమని పదిమంది వచ్చే పరిస్థితి లేదు.
– ఎన్ని డ్రామాలు వేసినా గతంలో తమరేం పీకారు అని అడుగుతున్నారు.
– చంద్రబాబు తాను 45 ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నాడు. అతనికి రాజకీయాలంటే ఒక ఇండస్ట్రీ మాత్రమే.
– ఆయనకు రాజకీయం అంటే ఒక పరిశ్రమ, ఇండస్ట్రీ…దాంట్లో నుంచి లాభాలు ఎలా పిండాలో చూస్తుంటాడు.
– మా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గారికి రాజకీయాలు అంటే సేవ
– పది మంది పేదల ముఖంలో ఆనందాన్ని చూడాలని మా సీఎం గారు పాటుపడుతున్నారు.
– కానీ చంద్రబాబుకు మాత్రం హెరిటేజ్ కంపెనీ పెట్టినట్లుగా తెలుగుదేశం పార్టీని కూడా ఒక కంపెనీగా నడుపుతున్నాడు.
సీఎంగా చేసిన నీకు అంచనాలు ఎప్పుడు ఎలా వేస్తారో తెలియదా..?:
– 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పే చంద్రబాబు వర్షాలు, వరదలు వస్తే అంచనాలు ఎప్పుడు, ఎలా చేస్తారో తెలియదా..?
– కనీసం ప్రభుత్వం యంత్రాంగాన్ని పనికూడా చేసుకోనివ్వకుండా దిగబడిపోయి అబద్దాలను ప్రచారం చేసి రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాడు.
– ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విధానాన్ని పారదర్శకంగా మార్చింది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌గారే మాత్రమే.
– చంద్రబాబు హయాంలో గాలికొదిలేసి, మిల్లర్లకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
– డ్వాక్రా సంఘాలు సేకరణ చేస్తున్నట్లు పుస్తకాల్లో చూపించి లెక్కలు రాసుకుని బ్యాగింగ్, ట్రాన్స్‌పోర్టు డబ్బులు వీరి పార్టీకి చెందిన పెద్దమనుషులు నొక్కేశారు.
– మా ముఖ్యమంత్రి గారు ఈ విధానాన్ని సమూలంగా మార్చేశారు.
– రైతు బరోసా కేంద్రంలో రైతులు నమోదు చేయించుకుంటే తక్షణమే వచ్చి కొనుగోలు చేస్తారు అని మేం స్పష్టంగా చెప్పాం.
– మిల్లర్లు వాళ్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ర్యాండమ్‌గా మిల్లులు మేమే కేటాయిస్తున్నాం.
– ఏ మిల్లు మీకు కేటాయిస్తే ఆ మిల్లుకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టు చార్జీలు, గోనెసంచుల ఖర్చు రైతు ఎకౌంట్లో వేస్తామని ఒక విధానం తీసుకొచ్చాం.
– తేమ శాతం ఎంత ఉండాలో కూడా నిర్ణయించి 17 శాతం కంటే ఎక్కువ ఉంటే ఏ విధంగా రైతుల నుంచి కొనుగోలు చేయాలో కూడా నిబంధనలు పెట్టి నడుపుతున్నాం.
– ఇవన్నీ చంద్రబాబుకు ఏమీ తెలియదు…ఎంత సేపటికీ ఆయనకు తెలిసింది శాపనార్ధాలు పెట్టడం మాత్రమే.
నీ నొక్కడు, బొక్కుడూ చూసే కదా నిన్ను ఇంటికి పంపింది..:
– రోడ్ల మీదకు వచ్చి పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు.బటన్ నొక్కడం కాదు బొక్కడం అంటున్నాడు.
– ఈ రాష్ట్రంలో బొక్కింది…నొక్కింది ఎవరో ప్రజలకు తెలియదా..?
– నీ నొక్కుడు, బొక్కుడు చూసే కదా ప్రజలు భరించలేకే నిన్ను ఇంటికి సాగనంపారు.
– నువ్వు ఎంత నొక్కావో, బొక్కావో తేల్చడం కోసమే ఒక కమిటీ వేస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు.
– సుప్రీం కోర్టు ఇలా స్టేలు ఇవ్వడం కుదరదని, విచారణ కొనసాగనివ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
– నీకు నొక్కుడు, బొక్కుడు తెలియకపోతే కోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నావు
– నేను నీతిమంతుడిని అని అంటే విచారణకు నిలబడవచ్చుగా..ఆ దమ్ము లేదు.
– ఎవరైనా సరే…అధికారంలో లేనివారు నేనొస్తే ఇది చేస్తాను అంటే జనం నమ్ముతారు.
– ఈ పెద్దమనిషి 1995లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు నేను మళ్లీ గెలిస్తే ధాన్యం ఆరబోసుకోడానికి ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తాను అంటున్నాడు.
– 1995 నుంచి ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయకుండా ఏం గడ్డిపీకావ్..?
నువ్వో పెద్ద సైకో…నీ కొడుకొక పిల్ల సైకో అని మేమూ అనగలం:
– మాకు సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో అంటావా..?
– నువ్వు సైకోలా ఒక పక్క…పిల్ల సైకోలా నీ కొడుకు ఇంకో పక్క తిరుగుతున్నాడు.
– మీ బాష ఏంటి..? మీరేంటి..?రాజకీయాల్లో హుందాతనం ఉండొద్దా..?
– నువ్వు, నీ ఎల్లో మీడియా రోజూ నీతులు చెప్తారు కదా…ఇలాంటి బాష వాడకూడదు అని నీ ఎల్లో మీడియా చెప్పడం లేదా..?
– టీవీ9, ఎన్టీవీ, సాక్షిని ఈయన బ్యాన్ చేస్తాడట..బ్లూ మీడియా అట
– ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబును ప్రజలు ఎప్పుడో బ్యాన్ చేశారు.
– ఇప్పుడొచ్చి బ్యాన్ చేస్తాను అంటే కుదరదు. నీకు 24 గంటలూ భజన చేసే వారు కావాలి.
– చంద్రబాబుకు లేవడానికి కూడా చేతకాకపోయినా బాహుబలిలా చూపించేవారు కావాలి. అలా చూపిస్తే వాళ్లు గొప్పవాళ్లు.
– మీరు బ్యాన్ చేసినంత మాత్రాన ఇక్కడ ఏమీ కాదు. మీకన్నా బలంగా సోషల్‌మీడియాలో ప్రజలున్నారు.
– ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒక మీడియాగా మారారు.
వర్షాలు తగ్గకుండానే అంచనా వేయడానికి నీ దగ్గరేమైనా మంత్రం ఉందా..?:
– నిడదవోలులో పది మంది పోగేసి ఒక సభ పెట్టాడు. ఒక యువకుడు ఏదో చెప్పబోతుంటే దూరంగా ఉండు కరోనా వస్తుంది అంటున్నాడు.
– చంద్రబాబే ఈ రాష్ట్రాన్ని కరోనాలా పట్టి పీడిస్తున్నాడు.
– ఎవడన్నా బుద్ది ఉన్నవాడివైతే, నువ్వు నాయకుడివైతే వర్షాలు పడుతుండగానే అంచనాలు ఎందుకు వేయలేదు, పరిహారం ఎందుకు ఇవ్వలేదు అంటున్నాడు.
– ఇంకా వర్షాలు తగ్గలేదు..అంచనాలు వేయలేదు..పంట ఎంత పోయిందో తెలియదు..నష్టపరిహారం ఎలా ఇస్తారు..?
– దీనికేమైనా మంత్రాలుంటే చెప్పు…ఏ పంట ఎంత పోయిందో మేమూ తెలుసుకుంటాం
– నేను రైతులకు ఎంతో చేశాను…రైతులకు మీరేమీ చేయడం లేదంటే ఒక అర్ధం ఉంది.
చంద్రబాబు సేకరించిన ధాన్యం బకాయిలను జగన్ కట్టారు:
– నేను మంత్రి గా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇంత దుర్మార్గంగా పాలన చేయవచ్చా అని ఆశ్చర్యపోయాను.
– రైతులకు ప్రకటించి ఇవ్వాల్సింది రూ.5942 కోట్లు ఎగ్గొట్టిన వ్యక్తి చంద్రబాబు.
– జగన్‌గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు ధాన్యం సేకరణకు పెట్టిన రూ.960 కోట్లు బకాయిలు తీర్చారు.
– చంద్రబాబు రైతుల నుంచి ధాన్యం సేకరించి ఆరు నెలలైనా డబ్బులు ఇవ్వలేదు.
– ఇది అన్యాయమని జగన్ గారు వెంటనే వారికి ఆ బకాయిలు తీర్చారు.
– చంద్రబాబు విత్తనాలు కొనుగోలు చేసిన డబ్బు కూడా ఎగ్గొట్టి పోతే ఆ బకాయిలను కూడా జగన్‌గారు తీర్చారు.
– ఇన్ పుట్ సబ్సిడీ నువ్వు ఎన్నిసార్లు ఎగ్గొట్టావో నీకు గుర్తుందా..?నన్ను గుర్తు చేయమంటావా చంద్రబాబూ..
– ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లో నష్టపరిహారం ఇస్తాననే విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జగన్‌గారు.
– ఏ కారణం వల్ల పంట నష్టపోయినా ఒక సీజన్‌లోనూ సకాలంలో పరిహారం ఇవ్వలేదు. అన్ని లెక్కలూ నా దగ్గర ఉన్నాయి.
– 2019లో ఎన్నికలు రాగానే పసుపు కుంకుమ అంటూ ఆ డబ్బంతా పెట్టి ఓట్లు కొనాలని చూశాడు
– నువ్వొచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్తే నిజం అయిపోతుందా..? నీ కబుర్లు ప్రజలు చాలా కాలం నుంచీ వింటున్నారు.
చంద్రబాబుకు రైతులంటే అమరావతి రైతులే:
– చివరికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 474 ఆత్మహత్యలని రైతు ఆత్మహత్యలు కాదని క్లోజ్ చేశాడు.
– మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కమిటీ వేసి వాటన్నిటిని పరిశీలించి వాళ్లందరికీ పరిహారం ఇచ్చారు.
– ఇదంతా చంద్రబాబుకి గుర్తులేదు..గజనీలా గంటకు ముందు జరిగింది ఈయనకి గుర్తుండదు.
– నీ ఉద్దరణ, నువ్వు ఊడబొడిచింది ఏమిటో అందరికీ తెలుసు.
– టీడీపీ కార్యకర్తలకు రైతు వేషాలు వేసి, నువ్వు రైతు వేషం వేయగానే సరిపోదు.
– చంద్రబాబుకి రైతులంటే అమరావతిలో భూములు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
– ఇన్ని కబుర్లు చెప్తున్న చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో ఏ రైతును పలకరించాడు.
– ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అని మాట్లాడుతున్నాడు..
– నీకు నచ్చిన జర్నలిస్టులను తీసుకుని హైదరాబాద్‌లో చంద్రబాబు ఇళ్లు…జగన్ గారి ఇళ్లు చూపిద్దాం. ఏది ప్యాలెస్ అనేది ప్రజలే తెల్చుకుంటారు.
– పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, పదవి లాక్కుని..అవసరానికి బావమర్ధులను, తోడళ్లుల్లని వాడేసి వదిలేసిన నిన్ను సైకో అంటారు.
– నిజంగా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాలంటే విలువైన సలహాలు ఇవ్వు.
– చంద్రబాబుకు అది చేతకాదు. నిరంతరం జగన్ గారిపై పడి ఏడవడమే తప్ప మరో పనే లేదు.
– ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని దరిద్రుడు అంటావా..? వళ్లు ఎలా ఉంది..ఈయనేమన్నా స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడా లేదా ప్రజలు చీదరించుకుంటున్నారు,
– రైతు వద్ద నుంచి పంటల కొనుగోలు విధానం ఎలా ఉందో, కరోనా సమయంలోనూ సివిల్ సప్లయిస్, మార్క్‌ఫెడ్ నుంచి ఎలా కొనుగోలు చేశామో చర్చిద్దాం రా.
– సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌ను ధాన్యం కొనుగోలు నుంచి తీసేశారు..ఆర్బీకేలకు అప్పజెప్పారు అంటూ అర్ధం లేకుండా మాట్లాడుతున్నాడు.
– ఇప్పటికీ సివిల్ సప్లయిస్ కార్పొరేషనే ధాన్యం సేకరిస్తోంది…ఆర్బీకేలు ఒక్క టూల్ మాత్రమే చంద్రబాబు.
– ఫీల్డ్‌లోకి వస్తున్నప్పుడు కనీసం తెలుసుకుని రావాలి కదా..
– పొలాల్లో పాడైపోయిన పంట అంచనాలు వేస్తారు. ఎంత శాతం పోయిందో చూసి ఎంతివ్వాలో నిర్ణయించి ఆ పరిహారం వచ్చే సీజన్ లోపు ఇస్తారు.
– నీలా ఎగ్గొట్టి పోయే వాళ్లం కాదు…ఇక్కడ ఉంది జగన్ గారు..
– ఇస్తానంటే ఇస్తాను..చేయలేను అంటే చేయలేను అంటాడు
– పచ్చి అబద్దాలు ప్రచారం చేసుకునే మీరు ఇక్కడకు వచ్చి నీతులు చెపున్నారు.
– ఇస్తానని చెప్పి చెయ్యకపోయినా భుజకీర్తులు తగిలించే ఎల్లో మీడియా మాకు లేదు.
ఏనాడైనా నువ్వు సకాలంలో పరిహారం ఇచ్చావా చంద్రబాబూ..?:
– టీడీపీ అధికారంలో ఉన్న ప్పుడు 2014 నుంచి 2019 వరకూ రబీలో వాళ్లు కొనుగోలు చేసిన ధాన్యం 74,69,981 మెట్రిక్ టన్నులు.
– జగన్‌గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 వరకూ 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేం కొనుగోలు చేశాం.
– చంద్రబాబు హయాంలో రూ.11,014 కోట్లు చెల్లిస్తే..జగన్ గారు వచ్చిన తర్వాత రూ.24,223 కోట్ల వ్యయంతో ధాన్యం కొనుగోలు చేశాం
– ఖరీఫ్‌లో చంద్రబాబు హయాంలో కొనుగోలు చేసింది 1.90 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా దాని విలువ రూ.29,222 కోట్లు.
– ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లలో ఖరీఫ్‌లో కొనుగోలు చేసింది 1.71 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా దాని విలువ రూ.32,653 కోట్లు.
– ఎవరు ఎక్కువ కొనుగోలు చేసినట్లు..ఎవరు రైతులకు అందుబాటులో ఉన్నట్లో చంద్రబాబు చెప్పాలి.
– అప్పుడు కుంభకర్ణుడిలా నిద్రపోయి..అమరావతిలో గజం ఎంతొస్తుందనే లెక్కల్లో ఉన్నారు.
– మధ్యలో లేచి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం రాజమౌళి గ్రాఫిక్స్ చేయించుకుని ఆహా ఓహో అంటూ కాలం గడిపారు.
– రైతుల వారీగా అన్ని సీజన్లు కలిపి చంద్రబాబు 17.94 లక్షల మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశారు.
– ఈ నాలుగేళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో 31.72లక్షల మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశాం.
– మా ప్రభుత్వంలో పెట్టిన ఉచిత పంటల బీమా ఏమిటో..అది ఎలా ఉందో నీకు వివరాలు పంపిస్తాం చూసుకో
– కేంద్ర ప్రభుత్వం వాటా రాకపోయినా వైఎస్సార్ ఉచిత పంటల బీమా ఏర్పాటు చేసిన విషయం నీకు తెలియదా..?
– నీ హయాంలో రైతు నిజంగా మునిగిపోయిన రోజు రూపాయి కూడా ఇవ్వలేదు.
– చంద్రబాబు హయాంలో లోన్ తీసుకున్న రైతుకు మాత్రమే బీమా వచ్చేది
– ఈ రోజు ఈ క్రాప్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకీ బీమా అందుతోంది.
– ఇంత కన్నా పారదర్శకంగా రైతుకు మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందా.?
– ఆర్బీకేలను దేశం, నీతిఆయోగ్ వంటి సంస్థలు పొగుడుతున్నా చంద్రబాబుకు మాత్రం వినపడవు.
– అధికారం తనకేదో సొంతం అయినట్లు టక్కున సిఎం కుర్చీలాగేసి తాను కూర్చోవాలి అనుకుంటున్నాడు.
– రెండు పేపర్లు, రెండు చానళ్లు బాకా ఊదితే ముఖ్యమంత్రి అయిపోతావా..?
– ప్రజలు, వారి ఆలోచనలు, వారు పొందుతున్న సంక్షేమం ఏమీ అక్కర్లేదు అనుకుంటున్నావా..?
– ఈ సీజన్‌లో ఈ వర్షాల పడినప్పుటి నుంచీ 6.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం.
– 66,252 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. రూ.1,247 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రూ.803 కోట్లు చెల్లింపులు చేశారు.
– వాస్తవాలు ఇలా ఉంటే ఏమీ జరగనట్లుగా అలవోకగా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నాడు.
ఆదిరెడ్డి అప్పారావు ఒక్కడే బీసీనా..ఆయన వల్ల నష్టపోయిన వాళ్లలో బీసీలు లేరా..?:
– నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు అనే బ్రేకింగ్ చూసి కంగారు పడ్డా.
– బీసీ నాయకులను ఈ ప్రభుత్వం వేదిస్తోంది అని చెప్పుకొచ్చాడు.
– మరి బీసీలు, ఎస్సీలు, ఓసీలు వాళ్లని నమ్మి డబ్బు కట్టి పాడైపోయిన వాళ్లు బీసీలు కాదా..?
– ఎంత సేపు వ్యాపారస్థులు, పెత్తందార్ల వైపు నిలబడతాడు.
– గతంలో ఆయిల్‌పామ్ రైతులు వస్తే నేను మీ పక్షాన నిలబడను అని స్పష్టంగా చెప్పాడు.
– మీ పార్టీ నాయకుడిని అరెస్టు చేశారని వెళ్లావు..దానికి కులం రంగు పూసేయడం ఎందుకు..?
– కులాల పిచ్చిని రాష్ట్రంలో ప్రవేశపెట్టింది నువ్వే కదా…?
– తప్పు చేసిన వాడిని శిక్షించవద్దని నీ సీనియారిటీ చెప్పిందా..?
రైతంటే గుర్తొచ్చేది వైఎస్సార్, జగన్ మాత్రమే:
– ఈ రాష్ట్రంలో రైతు అంటే గుర్తొచ్చేది..రాజశేఖరరెడ్డిగారు..జగన్ గారు
– రైతు సంక్షేమం అంటే గుర్తుకు వచ్చేది వైఎస్సార్…ఆ తర్వాత జగన్ గారు
– రైతులకు మేం ఏం చేశామో వంద చెప్తాం..నువ్వేం చేశావో ఒక్కటి చెప్పు చంద్రబాబూ
– రైతు రుణమాఫీ ప్రకటించి చేయలేకపోయిన వాడివి నువ్వు…రకరకాల సాకులు చెప్పి గద్దె దిగిపోయిన వాడివి నువ్వు.
– చెప్పిన హామీలకంటే ఎక్కువ ఇస్తున్న వ్యక్తి జగన్ గారు.
– రూ.50 వేల పెట్టుబడి సాయం నాలుగేళ్లు ఇస్తానని చెప్పి…ఐదేళ్లలో రూ.67,500 ఇస్తున్న ముఖ్యమంత్రి మా జగన్‌గారు
– రైతుల విషయంలో రాజకీయం చేయడం మానేస్తే చంద్రబాబుకు భవిష్యత్తులో కనీసం ప్రతిపక్ష హోదా అయినా మిగులుతుంది.
వాళ్లు మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు:
– చంద్రబాబు తన బాష అదుపులో పెట్టుకుంటే మంచిది.
– మా ముఖ్యమంత్రి చెప్పినా వినకుండా అలాంటి బాష మాట్లాడే వారు చాలామంది ఉన్నారు.
– వాళ్లు మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు..
– సైకో, దరిద్రుడు అంటూ పచ్చి పచ్చిగా మాట్లాడుతున్నావు..సంస్కారవంతమైన రాజకీయం చేయండి
– నోటికేది వస్తే అది మాట్లాడితే మర్యాద కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
– అమరావతిలో ముఖ్యమంత్రి గారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే దానిపై కోర్టులో కేసులు వేయించాడు.
– డెమోగ్రాఫిక్ ఇన్‌బ్యాలెన్స్ అన్నాడు…రాజధానిలో పేదలు ఎందుకు ఉండకూడదు అని హైకోర్టు తీర్పునిచ్చింది.
– వెంటనే వారితో సుప్రీం కోర్టులో అప్పీల్ చేయించాడు..దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారు చెప్తున్న క్లాస్ వార్ నిజమా కాదా..?
– పెత్తందార్లవైపు టీడీపీ..పేదలవైపు వైఎస్సార్సీపీ ఉన్న మాట వాస్తవమా కాదా..?
– పదిమందికి ఇళ్లు ఇస్తానంటే ఓర్వలేని చంద్రబాబు ఎక్కడా..? 31 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్న జగన్ గారు ఎక్కడా..?
మేము అండగా ఉన్నాం..చంద్రబాబు అబద్దాలను నమ్మొద్దు:
– అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పారు.
– రైతులు వద్ద ధాన్యం ఉంటే ఆర్బీకేలకు వెళ్లండి..నిబంధనలను కూడా ప్రభుత్వం సడలించి కొనుగోలు చేస్తోంది.
– మొదటి సారిగా బొండాలు ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.
– క్షేత్రస్తాయిలో ప్రభుత్వ యంత్రాంగం, శాసనసభ్యులు, మంత్రులు అందరూ ఉన్నారు.
– రైతులకు మేం విజ్ఞప్తి చేసేది ఒక్కటే…చంద్రబాబు లాంటి రాజకీయ ఎత్తుడగల మాటలను నమ్మెద్దు.
– ఓట్లు, రాజకీయం కోసం మాత్రమే మాట్లాడే చంద్రబాబు ఇలాంటి విషాన్ని ఎప్పుడూ చిమ్ముతూనే ఉంటాడు.
– చంద్రబాబు గురించి అందరికీ తెలుసు..ఈట్ పాలిటిక్స్…డ్రింక్ పాలిటిక్స్
– ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తాడు ఆయన. అయ్యో పాపం అనేది చంద్రబాబుకు తెలియదు.