Suryaa.co.in

Telangana

కేసీఆర్ .. ఇంకెంత మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవాలి?

-మానవత్వంలేని దుర్మార్గుడు కేసీఆర్
-నీ ఇంట్లో 5గురుకి ఉద్యోగాలిస్తవ్….యువతకు మాత్రం నోటిఫికేషన్లు ఎందుకివ్వవ్?
-ప్రభుత్వంపై యుద్దం చేయబోతున్నం
-ఈనెల 16న లక్షలాది మంది యువతతో ‘మిలియన్ మార్చ్’ నిర్వహించి తీరుతం
-కేసీఆర్ మెడలు వంచి గడీలనుండి బయటకు రప్పిస్తాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టీకరణ
-చిక్కడపల్లి కేంద్ర నగర గ్రంథాలయాన్ని సందర్శించి నిరుద్యోగ యవత పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకున్న సంజయ్
హైదరాబాద్ లోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీని ఈరోజు సందర్శించిన బండి సంజయ్ అక్కడ చదువుకుంటున్న నిరుద్యోగులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు పడుతున్న బాధలను కళ్లారా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాశాలిలా ఉన్నాయి….
‘‘ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మానవత్వం లేదు. రాష్ట్రంలో 140 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా కనీసం స్పందించరు. నోటిఫికేషన్లు వస్తాయనే ఆశతో అప్పులు చేసి ఏండ్ల తరబడి కోచింగ్ తీసుకుంటూ నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నా నోరు మెదపడు. ఫాంహౌజ్ నుండి బయటకు రారు. ఆయనింట్లో 5 గురికి ఉద్యోగాలొస్తయ్. కానీ యువతకు మాత్రం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వరు. ఆత్మహత్యలు చేసుకుంటుంటే మభ్యపెట్టడానికి కమిటీలంటూ కాలయాపన చేస్తున్నరు. ఇంకెన్నాళ్లీ మోసం….ఈ ప్రభుత్వంపై బీజేపీ యుద్దం చేయబోతోంది. ఈనెల 16న లక్షలాది మంది యువతతో మిలియన్ మార్చ్ నిర్వహించబోతున్నం. కేసీఆర్ మెడలు వంచుతాం. గడీల నుండి బయటకు రప్పిస్తం. నోటిఫికేషన్లు ఇచ్చేదాకా కొట్లాడతాం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది యువతే. 1400 మంది యువత అసువులు బాసారు. వారి ఆశలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అధికారంలో లేనప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటలకు…అధికారంలోకి వచ్చాక మాట్లాడుతున్న తీరే వేరైంది.
బీజేపీ కేసీఆర్ వ్యవహారశైలికి వ్యతిరేకంగా అనేక ఆందోళనలు చేసినం. యువత గోస వినడానికి, కళ్లారా చూడటానికే సెంట్రల్ లైబ్రరీకి వచ్చాను. యువత ఎన్ని కష్టాలు పడుతున్నరు? నోటిఫికేషన్ల లేక కన్నీళ్లు పెడుతున్నరు. సీఎం ఏనాడూ సోయిలో ఉండరు. దీనిపై స్పందించరు. నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆందోళన చేస్తే మీడియాకు ఇదిగో నోటిఫికేషన్లంటూ లీకులిస్తడు…ఎన్నికలొస్తే హామీలిస్తూ కాలయాపన చేస్తున్నడు.
సీఎం…నీది నోరా తాటిమట్టా? రోజుకో మాట…పూటకో హామీ ఇస్తవ్. మాట తప్పుతున్నవ్….ఆనాడు ఉద్యమం కోసం యువత ఆత్మహత్య చేసుకుంటే…ఈరోజు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడింది. ఇంకా ఎన్నాళ్లు యువత బలిదానాలు చేసుకోవాలి? ఎంత మంది చస్తే కేసీఆర్ కళ్లు చల్లబడతాయో చెప్పాలి.
కేసీఆర్…..నీ ఇంట్లనే 5 గురికి ఉద్యోగాలిస్తవ్. పదవుల్లేక నీ ఇంట్ల ఖాళీగా ఉండకూడదు. నీ మనవడు కూడా ఉద్యోగానికి రడీ అయితుండు. బయట మాత్రం ఒక్కరికి కూడా ఉద్యోగాలియ్యవ్. ఆనాడు ఇంటికో ఉద్యమిస్తానని చెప్పిన నువ్వు…ఈరోజు ఇంటికో ఉద్యోగం ఎట్లా సాధ్యమని మాట మారుస్తవ్?
నిరుద్యోగ భ్రుతి రూ.3.016 ఇస్తానని ఊరించుకుంటూ హామీలిచ్చినవ్? ఏమైంది? నీ ఇంట్ల మీ అందరివీ కలిపితే రూ.16 లక్షల దాకా జీతాలొస్తయ్. మరి నిరుద్యోగ యువత సంగతేంది? ఆనాడు పిట్ట కథలు చెప్పి రెచ్చగొట్టి ఆత్మహత్యలను ప్రేరేపించితివి. హుజూర్ నగర్ నుండి మొదలు దుబ్బాక, జీహెచ్ఎంసీ, నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికలు, హుజూరాబాద్ ఎన్నికల దాకా నోటిఫికేషన్ ఇస్తానని చెబుతూనే మభ్యపెడుతున్నవ్. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే కమిటీలంటూ కాలయాపన చేస్తున్నవ్.
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయ్. నోటిఫికేషన్ పేరు చెబితేనే నిరుద్యోగులు అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటూ మరింత నష్టపోతున్నరు. రూ.5లు భోజనం చేస్తూ కడుపు నింపుకోవడానికి చాలీచాలని తిండి తింటున్నరు.
టీఎస్పీఎస్సీలో 29 లక్షల మంది నిరుద్యోగులున్నరని ఛైర్మనే చెప్పిండు. తెలంగాణ వచ్చినంక 140 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నరు. తల్లిదండ్రులకు భారమైండ్రు. పండుగలు చేసుకోని దుస్థితి.
కేసీఆర్…..ఇంకా ఎన్ని రోజులు ఫాంహౌజ్ లో పడుకుంటవ్? పడుకోవడానికా నీకు అధికారం ఇచ్చిందా? బయటకు రా….నీకు పిల్లల్లేరా? నీ కొడుకు, బిడ్డ, అల్లుడు మాత్రం మంత్రులు, ఎమ్మెల్సీ కావాలా? నిరుద్యోగులు మాత్రం ఆత్మహత్య చేసుకోవాలా? సిగ్గుండాలి మీకు…
పేద విద్యార్థులు చస్తున్నా మానవత్వం లేని మానవ మ్రుగం సీఎం కేసీఆర్… యువత ఆత్మహత్య చేసుకుంటున్నా స్పందించని దుర్మార్గుడు. మిలియన్ మార్చ్ పేరుతో నీ ప్రభుత్వ సంగతి చూస్తాం. నీ మెడలు వంచుతాం. గడీల నుండి బయటకు రప్పిస్తా.
యువత బాధ వింటుంటే మనుషులనే వారికి బాధేస్తుంది. ఈనెల 16న మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం. లక్షలాది మంది యువతను రప్పిస్తాం. సీఎం…నీకు దమ్ముంటే అడ్డుకో.
యువతకు ఒక్కటే నా వినతి…మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ తల్లిదండ్రులకు గుండె కోత పెట్టొద్దు. మీ తరపున బీజేపీ యుద్దం చేస్తుంది. ప్రభుత్వ మెడలు వంచి నోటిఫికేషన్లు వచ్చేలా చేస్తుంది. మాట్లాడితే కేంద్రం ఏం చేసింది? పక్క రాష్ట్రాలు ఏం చేసినయని మాట్లాడుతున్నడు సీఎం.. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు రెగ్యులర్ గా వేస్తున్నరు…నువ్వెందుకు వేయవు మరి? కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించింది…నువ్వెందుకు వ్యాట్ తగ్గించవు…సిగ్గుండాలి ఈ సీఎంకు.

LEAVE A RESPONSE