– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
– రవీంద్ర భారతిలో వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి
జంట నగరాల ప్రజలకు త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం కృష్ణా, గోదావరి జలాలు తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం కు దక్కుతుంది.దేశం మొత్తం ఎంతో గొప్పగా చెప్పుకొనే విధంగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించింది.తండాలు, గూడాలలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నాం.
నిండు వేసవిలో సైతం ఎక్కడా త్రాగునీటి సమస్య లేదు.గతంలో త్రాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద, రోడ్లపై ఆందోళనలు, ధర్నాలు జరిగేవి. ఒక విజన్ ఉన్న నాయకుడు పాలకుడైతే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన గొప్ప నాయకుడు కేసీఆర్.