Suryaa.co.in

Telangana

కేసీఆర్ తెలంగాణలోనే చెల్లని రూపాయి

– కేసీఆర్ మాటలు బఫూన్ మాటలు అని ప్రజలు నవ్వుకుంటున్నారు
– వేరే రాష్ట్రం వారు నమ్మడం లేదు
– కరప్షన్, కుటుంబ పాలనకు మారుపేరు కేసీఆర్
– కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయితీయడనికి పోయినట్టు ఉంది కెసీఆర్ వ్యవహారం.
– ఈటల రాజేందర్
– చౌటుప్పల్ మండలం కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఈటల రాజేందర్

చౌటుప్పల్ : బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఆనాటి నిజాం నవాబు తోత్తులు అయిన భూస్వాములకు వ్యతిరేకంగా తన ప్రాణాలను పనంగా పెట్టి చాకలి ఐలమ్మ పోరాటం చేసింది. పీడిత ప్రజానీకంకు అండగా నిలిచింది. ఆమె విగ్రహాన్ని టాంక్ బండ్ మీద పెడతా అని చెప్పిన సీఎం మర్చిపోయారు. ఈ సందర్భంగా మరో సారి డిమాండ్ చేస్తున్న. ఆమె జయంతి, వర్ధంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగా జరపాలని కోరుతున్నాను. అమరవీరుల స్థూపం కూడా త్వరితగతిన పూర్తి చెయ్యాలి. అమరవీరుల కుటుంబాలకు ఇస్తా అన్న సదుపాయాలు ఇవ్వలేదు. వాటిని వెంటనే నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తున్న.

అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చతికలపడిపోతుంది. కెసిఆర్ నియంతృత్వం, దోపిడీ అరికట్టలేకపోయారు అని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బీజేపీకి మాత్రమే ఆసత్తా ఉంది అని బీజేపీలో చేరారు. ధర్మానికి కట్టుబడి రాజీనామా చేసి మీ ముందుకు వచ్చారు. కేసీఆర్ ను ఓడించడానికి అనేకమంది ప్రజాప్రతినిధులు, నాయకులు బీజేపీలో చేరుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ లో చేసినట్టే ఇక్కడ కూడా చేస్తుంది. మద్యం పంచి, డబ్బులు ఇచ్చి మభ్యపెట్టాలని చూస్తున్నారు.సర్పంచ్ లకు బిల్లులు రావాలి అంటే టిఆర్ఎస్ పార్టీలో చేరాలి.. లేదంటే పదవే పీకిస్తమని కలెక్టర్నీ అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారు. చాలా మంది సర్పంచ్ లు ఫోన్ చేసి చెప్తున్నారు ..మేము మనుషులుగా టీఆర్ఎస్ లో ఉన్నాము మా మనసంతా మీతోనే ఉంది అని చెప్తున్నారు.కెసిఆర్ కి గుణపాఠం చెప్పకపోతే బ్రతుకు లేదు అంటున్నారు. కట్టుబానిసలుగా చూస్తున్నారు. గౌరవం లేకుండా కెసిఆర్ చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ కెసిఆర్ ను గెలవనిచ్చేది లేదనీ వారంటున్నారు. మర్రిగుడెం మండలంలో భూ నిర్వాసితులు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత వారి బకాయిలు ఇస్తున్నారు. ఉప ఎన్నిక వస్తేనే కెసిఆర్ కదులుతారు. లేదంటే ఇనుప కంచెల లోపల, పోలీసు పహారాలో ఉంటారు. కులం, పార్టీ, జెండాతో సంబందం లేకుండా రాజగోపాల్ రెడ్డినీ గెలిపించడానికి మునుగోడు ప్రజలు సిద్దం అయ్యారు. కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయితీయడనికి పోయినట్టు ఉంది కెసీఆర్ వ్యవహారం. ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు అస్వస్థతకు గురి అవుతున్నారు.ధనిక రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారు.24 గంటల కరెంటు ఇస్తా అని 9 గంటలు కూడా ఇవ్వడం లేదు. కరప్షన్ కి మారుపేరు కేసీఆర్, కుటుంబ పాలనకు మారుపేరు కేసీఆర్.

ప్రజల విశ్వాసం కోల్పోయిన కెసిఆర్ దేశాన్ని పాలిస్త అనే మాటలు..బఫూన్ మాటలుగా అనుకుంటున్నారు. వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యే లు ఆహా ఓహో అనుకుంటున్నారు కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు. కెసిఆర్ కి ఆసత్తా,శక్తి లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా కేసీఆర్ పట్ల విశ్వాసం లేదు. ఇక్కడే చెల్లని రూపాయి కేసీఆర్ అని ఈటల రాజేందర్ అన్నారు.

LEAVE A RESPONSE