కేసీఆర్ ప్లాన్ బూమెరాంగ్

అసలు తెలంగాణలో ఏమైంది?
మొన్న కారులో కోటి రూపాయలు దొరికితే, నోట్ల కట్టలు బయట పెట్టి షో చెయ్యాలి. ఈ రోజు ఫామ్ హౌజ్ లో 100 కోట్లు దొరికితే, కనీసం 100 రూపాయలు కూడా బయట పెట్టరు. టిఆర్ఎస్ ప్రభుత్వం మ్యాజిక్. అంటే టీఆర్ఎస్ వాళ్ళ కు ఏం జరిగినా ముందే తెలిసిపోతాయి. అప్పుడు శ్రీనివాస్ గౌడ్ మీద హత్యాయత్నం , తరువాత జీవన్ రెడ్డి మీద హత్యాయత్నం , ఇప్పుడు ఎమ్మెల్యే ల కొనుగోలు. ఇది మొత్తం పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది.

బూమరాంగ్ కాబోతున్న టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్..
మునుగోడులో ప్రచారంలో ఉండాల్సిన నలుగురు ఎమ్మెల్యేలు, హైదరాబాద్ ఎందుకు వచ్చారు? అనుక్షణం ఏ పోలింగ్ బూత్‌లో ఏం జరుగుతుందో, మంత్రి కేటీఆర్ ఇన్చార్జిలతో నిత్యం టచ్ లో ఉంటున్నాడు. అలాంటప్పుడు ప్రచారాన్ని వదిలి, కేటీఆర్ అనుమతి లేకుండా హైదరాబాద్ కి వస్తారా? ఒకవేళ బేరసారాల కోసం వచ్చినట్లయితే .. తటస్థంగా ఉండే ప్లేస్ ని ఎంచుకుంటారు. అత్యంత రహస్యంగా ఆపరేషన్ జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి ఆపరేషన్ చేయాల్సి వస్తే .. బిజెపి సేఫెస్ట్ ప్లేసులైన కర్ణాటక, గోవా, మహారాష్ట్ర లేదా మరో రాష్ట్రాన్ని ఎంచుకుంటుంది.

ఒకవేళ ఇలాంటి ఆపరేషన్ చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకుంటారు? . ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యవస్థ పోలీసు ఇంటలిజెన్స్, అన్ని వ్యవస్థలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి అన్న విషయం బిజెపి పెద్దలకు తెలియదా? ఆ ఫామ్ హౌస్ ప్రస్తుతం ఆపరేషన్ లో ఉన్న, నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిది. ఆపరేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, పోలీసులకు ఎందుకు సమాచారం ఇస్తారు?

అక్కడికి వచ్చిన సిపి స్టీఫెన్ రవీంద్ర ఎందుకు పూర్తి వివరాలు వెల్లడించలేకపోయారు? మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు నీళ్లు నమిలారు. సేమ్ మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కేసు లాగానే. శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం అంటూ పెద్ద డ్రామాని, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నడిపారు. శ్రీనివాస్ గౌడ్ హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్న మున్నూరు రవి, మిగతా వారందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. ఇదే కేసులో బెయిల్ పొందిన మున్నూరు రవి, టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి హాజరయ్యారు. ఇప్పటివరకు మున్నూరు రవి టిఆర్ఎస్ కార్యకర్తగానే కొనసాగుతున్నారు. అప్పుడు ఈ కేసులో బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మీదకి వచ్చేలాగా ప్లాన్ చేశారు. అప్పుడు కూడా సిపి స్టీఫెన్ రవీంద్ర , మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు.

అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీద హత్య ప్రయత్నం కూడా, సొంత పార్టీ సర్పంచినే చేశారు. ఈ కేసు విషయంలో టిఆర్ఎస్ నేతల హడావిడి అంతా ఇంతా కాదు.ఈ రెండు కేసులో ఇప్పటివరకు చార్జి షీటు దాఖలు చేయలేదు. అన్ని వ్యవస్థలు టిఆర్ఎస్ వాళ్ళే కదా.. ఎందుకు ఈ కేసులు అటక ఎక్కించారు?

ఫామ్ హౌజ్ ఆపరేషన్ విషయానికి వస్తే.. నందు అనే వ్యక్తి కిషన్ రెడ్డి ఫాలోవర్ గా చూపిస్తున్నారు. ఇతనికి బిజెపి కన్నా టీఆర్ఎస్ నేతలతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా పిలిస్తే , తన నియోజకవర్గం ..ఇతర ప్రాంతాలు వెళ్లి షాపులు ఓపెన్ చేయగానే, బిజెపి వ్యక్తులు అయిపోతారా?

స్వామీజీ విషయానికి వస్తే .. బిజెపి అనగానే స్వామీజీలు మతాధిపతులు అనే కవరింగ్ వచ్చేలా , ఒక స్వామీజీని సెట్ చేసినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ కడపకు చెందిన స్వామీజీని ఎలా సెట్ చేశారు? ఇలాంటి ఆపరేషన్ చేయాలనుకుంటే బిజెపిలో చాలామంది కేంద్ర మంత్రులు, పార్టీ లో కీలక నేతలకి అప్పజెప్తారు. ఎవరో కోన్ కిస్కా గొట్టం గాళ్లతో తో , ఇలాంటి ఆపరేషన్ చేయించరు.

100 కోట్ల డీల్ అని మీడియాలో లీకేజీ లు ఇచ్చారు. కానీ డబ్బు ఎంత అనేది స్పష్టంగా చెప్పలేదు. ఇది క్లియర్ గా టిఆర్ఎస్ పార్టీ , బిజెపి మీద బురద చల్లే యత్నం లాగా కనిపిస్తూ ఉంది. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నది కాబట్టి , బీజేపీ మీద ఈ రకమైన మైండ్ గేమ్ కి ప్లాన్ చేసింది. ఈ ఆపరేషన్ టీఆర్ఎస్ పార్టీకి పెద్ద బూమరాంగ్ కాబోతున్నది. ఈ తతంగం అంతా ప్రజలు గమనిస్తున్నారు జాగ్రత్త!

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిలభారత ఓసి సంఘం మరియు
EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు)

Leave a Reply