కేశినేని.. నువ్వేంది.. నీ స్థాయి ఏంటీ?

-నువ్వు గెలిస్తే బుద్దా భవన్ ఇచ్చేస్తా.. నేను గెలిస్తే కేశినేని భవన్ ఇస్తావా ?
-కేశినేని కామెంట్స్‌కు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న కౌంటర్

నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా.. చంద్రబాబు నాతో తిట్టించలేదు. నీ రాజకీయ జీవితం కోసం చంద్రబాబు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? బుద్దా వెంకన్నతో చంద్రబాబు మాట్లాడించాలా? నువ్వేంది.. నీ స్థాయి ఏంటీ? నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు పట్టదు. కేశినేని వైసీపీ కోవర్టు. కేశినేని నానికి, కేశినేని చిన్నికి ముందు నుంచే గొడవలున్నాయి.

కేశినేని చిన్నిపై పెట్టిన కేసులను చంద్రబాబు పెట్టమన్నారా? సొంత తమ్ముడి భార్యపై ఎవరైనా కేసులు పెడతారా? నువ్వు సొంతంగా గెలిచావా? రేపు నువ్వు గెలుస్తావా? నువ్వు గెలిస్తే బుద్దా భవన్ ఇచ్చేస్తా.. నేను గెలిస్తే కేశినేని భవన్ ఇస్తావా ?

నువ్వు నిజాయితీ పరుడువి.. విజయవాడకు కాపలాదారుడివా? బీసీలు సంపాదిస్తే అక్రమార్జనా.. నీది సక్రమార్జనా? చంద్రబాబు మోసగాడా? నీకు రెండుసార్లు టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు మోసగాడా? టీడీపీ జెండా భుజాన ఉన్నత వరకే మనకు విలువ . టీడీపీ జెండా పక్కనపడేస్తే నీకూ, నాకూ విలువ ఉండదు. కేశినేని నానీ.. నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు? శ్వేతను చంద్రబాబు పోటీ చేయమన్నారా? శ్వేత పేరును నాని సొంతంగా ప్రకటించుకున్నారు కేశినేని నాని ఎక్కడ ఖర్చు చేశారు? చంద్రబాబు నిన్ను పిలవాలా? నీకు ప్రొటోకాల్ ఎవరిచ్చారు? ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం ఖాళీ అవుతుందా? ఒక్క కార్యకర్తను కూడా పక్కకు కదిలించలేవు

Leave a Reply