Suryaa.co.in

International

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో అయోధ్య ప్రతిష్ట లైవ్

అమెరికా వాణిజ్య నగరమైన న్యూయార్క్ లోని “టైం స్క్వేర్” అనేది ప్రపంచంలోనే అతి గొప్ప కూడలి. ఇక్కడ సహజంగా ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమాలనే లైవ్ టెలీకాస్ట్ చేస్థారు. ఇప్పుడు ఆ ప్రపంచ ప్రఖ్యాత లిస్టులో మన అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టను కూడా చేర్చారు. ఈ నెల 22వ తారీకున అయోధ్య లో జరగనున్న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను న్యూయార్క్ టైం స్క్వేర్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగే శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను టైం స్క్వేర్ లో లైవ్ టెలీకాస్ట్ చేయనున్నారు. ఈ సంధర్బంగా ప్రధాని మోడీ చేయనున్న స్పీచ్ ను కూడా ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేయనుండటం విశేషం.

LEAVE A RESPONSE