Suryaa.co.in

Telangana

కిషన్‌రెడ్డి గారూ.. అన్నీ మీకేనా?

– గులాంగిరి చేసేవాళ్లకే టికెట్లు ఇస్తారా?
– ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపికపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం

హైదరాబాద్ : బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పార్లమెంటు నియోజకవర్గానికే పదవులు ఇస్తారా? హైదరాబాద్‌లో ఇంక బీజేపీ అభ్యర్థులే లేరా? అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. మిగతా నేతలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ అధిష్ఠానానికి సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. మీకు గులాంగిరి చేసేవారికే పదవులు, టిక్కెట్లు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE