– రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట..!
-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్: రాష్ట్రంలో గుండా రాజ్యం కొనసాగుతున్నది. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఏది చెబితే దాన్నే శిరసావహిస్తున్నారుఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి కావచ్చు, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పై దాడి కావచ్చు, ముషీరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై దాడి కావచ్చు, తెలంగాణ భవన్ పై దాడి కావచ్చు, ఇవన్నీ ముఖ్యమంత్రి కనుసన్నలలో జరిగాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు..
హైడ్రా మూసీ కూల్చివేతల భయంతో గంధ శ్రీకుమార్ (55) అనే వ్యక్తి గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందాడని కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రజల ప్రాణాలను తీస్తున్నది.
ప్రభుత్వం లో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. నిరుపేదల ఇల్లు కూలగొడుతున్నాం మరి వారి పరిస్థితి ఏంటి అని దయకాని కరుణ కానీ, విచక్షణ కాని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదు. ప్రజల మాన ప్రాణాలు రక్షించాల్సిన ముఖ్యమంత్రి, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు.
ఇందులో చాలా మంది రిటైర్మెంట్ ఉద్యోగాలు ఉన్నారు.. వీళ్ళు జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతో కొనుక్కున్న ఇండ్లను కూలగొట్టిండ్రు.
అనుమతులు ఇచ్చిన అధికారులు బాగానే ఉన్నారు. ఇళ్లు ను నిర్మించి ఇచ్చిన బిల్డర్లు బాగానే ఉన్నారు.కానీ కొనుక్కున్న వారు మాత్రం తమ జీవితంలో ఇంకో ఇళ్లు కట్టుకోగలరా? ఈ మాత్రం జ్ఞానం లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వం వ్వవహారం జరుపుతోంది.