– పాల్గొన్న సైబరాబాద్ సీపీ, పోలీస్ సిబ్బంది
విజయదశమి సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., పాల్గొని ఆయుధాలకు పూజలు చేశారు. హెడ్ క్వార్టర్స్‌లోని బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ ఎక్విప్‌మెంట్ స్టోర్, ఆర్ఐ స్టోర్స్, మాగజైన్ రైటర్, మాగజైన్, బెల్ ఆఫ్ ఆర్మ్స్ రూమ్, డ్యూటీ ఆఫీసర్ రూం, బీడీ టీమ్ స్టోర్, ఏఆర్ఎస్ఐ రూమ్,ఎం టీ సెక్షన్ , ఏసీపీ హెడ్ క్వార్టర్స్ రూమ్‌లలో ఆయుధాలు, వాహనాలు, ఇతర సామగ్రికి ఆయన పూజలు చేశారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారని అన్నారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సైబరాబాద్ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ లావణ్య ఎన్జేపీ, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, సీఎస్ డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీలు మట్టయ్య, కృష్ణ , ధనలక్ష్మి, ఇన్‌స్పెక్టర్లు, ఆర్ఐలు, హెడ్ క్వార్ట్స్ సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..