వారెవ్వా క్యా జోష్ రే….

-ప్రజా సంగ్రామ యాత్రలో యూత్ కిరాక్ డ్యాన్సులు
-మహిళలు సైతం కదం తొక్కుతూ అద్భుతమైన డ్యాన్సులు చేస్తున్న వైనం
-పాదయాత్రలో కార్యకర్తలకు ఉత్సాహం కలిగిస్తూ అలసట లేకుండా చేస్తున్న కళాకారులు
-యూత్ జోష్, కళాకారుల కవాతుతో ఉత్సాహంగా అడుగులు వేస్తున్న బండి సంజయ్

‘‘యూత్ కిరాక్ డ్యాన్సులు…. మేమేం తక్కువంటూ అదిరిపోయేలా మహిళల తీన్మార్ చిందులు… ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కళాకారుల ఆటపాటలు…..’’ వెరసి బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఫుల్లు జోష్ తో నభూతో నభవిష్యత్ అనేలా కొనసాగుతోంది.

మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ టీఆర్ఎస్ కుటుంబ-నియంత-అవినీతి పాలనలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా బండి సంజయ్ సాగిస్తున్న పాదయాత్రలో కళాకారుల ఘట్టం మరువలేనిది.

బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ ఎర్రటి ఎండలో నడుస్తున్న వందలాది మంది కార్యకర్తలు, యువకులకు అలసట తెలియనీయకుండా కళాకారులు డ్యాన్సులు చేస్తున్నారు. ప్రముఖ కళాకారుడు

దరువు ఎల్లన్న ఆధ్వర్యంలో కళాకారుల బ్రుందం అద్బుతమైన పాటలు పాడటమే కాకుండా వాటికి తగ్గ డ్యాన్సులు వేస్తూ పాదయాత్ర చేసే వారిలో జోష్ నింపుతున్నారు.

అలసటతో సేద దీరాలనుకునే వారికి సైతం వీరు వీస్తున్న స్టెప్పులకు మైమరిచిపోయి వారితో కలిసి డ్యాన్సులేస్తూ చివరిదాకా నడుస్తూనే ఉన్నారు. పాదయాత్రలో ఈ ఘట్టాన్ని చూస్తూ అనేక మంది సామాన్య ప్రజలు కూడా ‘మేము సైతం ’ అంటూ బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదులుతున్నారు.

మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కువ మంది యువత, కళాకారులు పాల్గొనగా… .ఈసారి అత్యధిక సంఖ్యలో మహిళలు సైతం పాల్గొనడం విశేషం. సుమారు 50 మంది మహిళలు తొలిరోజు మొదలు రెండో విడత పాదయాత్ర ముగిసేంత వరకు పాల్గొనేందుకు సిద్ధమై రావడం గమనార్హం.

మహిళల కోసం ప్రజా సంగ్రామ నిర్వాహకులు ప్రత్యేకంగా బసను ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పాదయాత్రలో పాల్గొంటూ బండి సంజయ్ తోపాటు సగటున రోజుకు 13 కిలోమీటర్లు నడుస్తున్నారు.

ఎండలు మండిపోతున్న సమయంలో పాదయాత్ర చేయగలమా? అనే సందేహం ఉన్న నేతలు సైతం యువత, మహిళలు, కళాకారుల జోష్ ను చూసి అలసటను మర్చిపోతూ ఉత్సాహంగా ముందుకు నడుస్తుండటం విశేషం. వీరి జోష్ ను చూసి లీడర్లు సైతం వారితో కలిసి డ్యాన్సు చేయడం మరువలేనిది.

మరోవైపు బండి సంజయ్ పాదయాత్రలో ప్రతి చోటా ప్రజలతో మమేకమవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ… వారికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నారు.

పాదయాత్రలో ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లే సమయంలో పెద్దగా జన సంచారం లేని చోట, ఎక్కువ దూరం నడవాలే భావన కలిగిన సమయంలో పాదయాత్ర చేస్తున్న నాయకులు అలసటకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే కళాకారులు, మహిళలు, యువత డీజే సౌండ్ లో వచ్చే పాటలకు మై మరిచి తీన్మార్ డ్యాన్సులు వేస్తూ ఆయా నేతలకు అలసట లేకుండా చేస్తుండటం విశేషం.

మొత్తమ్మీద రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర సాఫీగా సాగడానికి, ఎంత దూరమైనా నడవాలనే భావనకు రావడానికి కళాకారులు, మహిళల బ్రుందం చేస్తున్న క్రుషి మరువలేనిది. వీరి ఆటలు పాటలు ఒక రకంగా పాదయాత్రకు ఓ టానిక్ లా ఉపయోగపడుతోందనడంలో అతిశయోక్తి లేదు.

Leave a Reply