– విద్య కోసం సొంత నిధులు వెచ్చించిన ఎమ్మెల్యే సుజనా ఛౌదరి
విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలో శాసన సభ్యునిగా ఎంపికై బాధ్యతలు చేపట్టిన నాటి నుండి విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పనలపై యలమంచలి సత్యన్నారాయణ చౌదరి (సుజనా ఛౌదరి) ప్రత్యేక దృష్టి సారించారు.
ఎందరో పేద విద్యార్థులకు విద్య నందించే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను వేదిస్తున్న నిధుల కొరతను అధిగమించి వాటిలో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేసే దిశగా పని చేయడం ప్రారంభించారు.
ఒక వైపు ప్రభుత్వ నిధులపై దృష్టి సారిస్తూ వాటిని త్వరిత గతిన రప్పించేందుకు కృషి చేస్తూనే మరో వైపు స్వంత స్వచ్ఛంద సంస్థ సుజనా ఫౌండేషన్ తో కార్పొరేట్ సొషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద అందుబాటులో ఉండే నిధులను సేకరిస్తూ ప్రణాళికా బద్దంగా నియోజకవర్గంలోని విద్యా సంస్థలలో సమూళ మార్పులను తీసుకొనివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. “Making Vijayawada West the Best” లక్ష్యంతో Education, Employment, Entrepreneurship (E³) ప్రణాళిక కింద, విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రాక్టికల్ స్కిల్స్, భవిష్యత్తు అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు.
ఇందులో భాగంగా సుజనా ఫౌండేషన్, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారు అందించిన నిధులతో పశ్చిమ నియోజకవర్గంలోని కబేళా వద్ద నున్న ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో సరికొత్త ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ ల్యాబ్ లను పునఃనిర్మించడమే కాకుండా అందులో ప్రయోగాలకు అవసరమైన పరికరాలు, సామగ్రిని సమకూర్చారు. ఇందుకోసం సుమారు 12 లక్షల రూపాయల విలువైన నిధులను వెచ్చించారు.
పునః నిర్మించిన ఈ ల్యాబ్ లను సోమవారం ఎమ్మెల్యే యలమంచలి సత్యన్నారాయణ ఛౌదరి (సుజనా ఛౌదరి)… ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ , స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య మరియు కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు.
ల్యాబ్ ల ఏర్పాటుకు సహకరించిన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కు చెందిన సాంగ్రామ్, సాయి ప్రసాద్, పవన్ లతో పాటూ సుజనా ఫౌండేషన్ బృందం సభ్యులైన కిరణ్ వీరమాచినేని, హరీశ్ కుమార్ లతో పాటూ విజయవాడ వెస్ట్‌లో Education Development ప్రోగ్రాం ను డ్రైవ్ చేస్తున్న పైలా సురేష్, ప్రాజెక్టు రూపకల్పనలో సహకరించి ఉదయ్ కుమార్, మూర్తి లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వారితో పాటూ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కు చెందిన సాంగ్రామ్, సాయి ప్రసాద్, పవన్ లు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ హఫీజ్ షేక్ అహ్మద్, అధ్యాపకులు వెంకట్, రఫీక్, సుల్తానా, రమణ, రాజేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గం ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ పైలా సురేష్, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, మైలవరపు కృష్ణ, పగడాల కృష్ణ, తిరుపతి అనూష, తిరుపతి సురేష్, రెడ్డి పల్లి రాజు తదితరులు పాల్గొన్నారు