-రాష్ట్రంలో మద్యం.. పులివెందులలో చేపలు, రొయ్యల మార్ట్ లాంటి వాటి కోసం సీఎం బాగా కృషి చేశారు
– బీజేపీ నేత లంకా దినకర్ ఎద్దేవా
సీఎం జగన్మోహనరెడ్డి బులుగు టోపీ నెత్తిన పె ట్టుకుని 96400 కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు రాష్ట్ర ప్రజల నెత్తిన టోపీ పెడుతున్నారు.ఓఎన్జీసీ కేంద్ర ప్రభుత్వం చొరవతో రాష్ట్రంలో పెట్టిన, పెడదామనుకున్న 78 వేల కోట్ల పెట్టుబడులు తమ ఖాతాలో వేసుకునే జగనన్న ప్రయత్నం రోత పుట్టిస్తున్నది. భారత్ ఎలక్ట్రానిక్స్, ఐటీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు పెట్టే పెట్టుబడులన్నీ కేంద్ర ప్రభుత్వం చొరవతో మాత్రమే వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో మద్యం పులివెందులలో చేపలు, రొయ్యల మార్ట్ లాంటి వాటి కోసం సీఎం బాగా కృషి చేశారు. వైఎస్సార్సీపీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రం వదిలి పోయిన కంపెనీల లిస్ట్ వేస్తే చాంతాడంత ఉంటుంది. ఎవరికో పుట్టిన పిల్లలకు తండ్రి గా ప్రకటించుకోవడం ఎలాగో, కేంద్ర ప్రభుత్వ కంపెనీల పెట్టుబడులు తమ ఘనకార్యంలా ప్రచారం చేసుకోవడం కూడా అంతే.