– గతంలో పేరుకే స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు
– జగనన్న కాలనీల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు
– వైసిపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్
గుడివాడ, (గుడ్లవల్లేరు) మార్చి 15: వైయస్సార్ జగనన్న కాలనీల్లో పేద ప్రజలు ఇళ్ల నిర్మాణాలను చేపట్టి తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ పిలుపునిచ్చారు. గుడ్లవల్లేరులోని జగనన్న కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను దుక్కిపాటి శశిభూషణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా దుక్కిపాటి విలేఖరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పెరిగే ఇళ్లస్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నాయని తెలిపారు. పొలాలు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడం వల్ల వీళ్లను నిర్మించుకునే వారు నరకయాతనను అనుభవించాల్సి వచ్చేదన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని ధనియాల పేట, వాంబే కాలనీ, న్యూ ఇందిరా నగర్ కాలనీతో పాటు పలు గ్రామాల్లోని అనేక కాలనీలు నేటికీ మౌళిక వసతులకు నోచుకోలేదని చెప్పారు. దీంతో ఆయా కాలనీల్లో ప్రజలు రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పరిమితం కాలేదని చెప్పారు. ఇల్లు నిర్మించుకునే వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టారని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఇళ్లను నిర్మించి ఉంటున్నారని చెప్పారు. వైయస్సార్ జగనన్న కాలనీల్లో పెద్దఎత్తున మౌలిక వసతుల కల్పన జరుగుతోందని అన్నారు. గుడ్లవల్లేరు జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు రూ. 1.80 లక్షలను ప్రభుత్వం ఇస్తోందని, ఎన్నికలతో అన్ని హంగులతో ఇళ్లు సమకూరుతున్నాయని తెలిపారు. మంత్రి కొడాలి నాని చొరవ, సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు వల్ల జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల జరుగుతోందని దుక్కిపాటి శశిభూషణ్ చెప్పారు.