ప్రజా పాలన దరఖాస్తులు జనవరి 6నే చివరి రోజు

-కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారు
-కేసీఆర్ ను రక్షించేందుకే సిబిఐ విచారణ బీజేపీ అడుగుతుంది
-కిషన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే రాష్ట్రంలో సీబీఐ పై బ్యాన్ ఎత్తివేస్తాం
-ఆటో డ్రైవర్లు బిఆర్ఎస్ ట్రాప్ లో పడకండి
-మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకిస్తున్నారా?
-ఆటో డ్రైవర్లతో చర్చలకు సిద్ధం
-మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా పాలన దరఖాస్తులు జనవరి 6నే చివరి రోజు. మళ్ళీ గడువు పొడిగింపు ఉండదు. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసు. కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారు. కాళేశ్వరం పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించాము. కేసీఆర్ ను రక్షించేందుకే సిబిఐ విచారణ బీజేపీ అడుగుతుంది.

బీఆర్ఎస్ కు బీజేపీకి దోస్తీ ఉంది. గోషామహల్ లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు, జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ పై ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టింది. ఇప్పటి కి బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకునే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించకుంటే… మీ లేఖకు విలువ లేకుంటే కిషన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. బీజేపీది, బిఆర్ఎస్ ది అపవిత్ర కలయిక. వాళ్ళు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు తిట్టుకుంటారో తెలియదు.

కాళేశ్వరం ఏటీఎం అని బీజేపీ పదే పదే అన్నది నిజం కాదా.? లిక్కర్ స్కామ్ అని కూడా బీజేపీ అన్నది. కిషన్ రెడ్డి… కేసీఆర్ కు ఇంత తోత్తు గా మాట్లాడవద్దు. మాట్లాడే ముందే ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజల విషయంలో కేసీఆర్ కుటుంబం అనేక తప్పులు చేసింది. ఆరు గ్యారెంటీలు సోకులకు కాదు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసమే.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే రాష్ట్రంలో సీబీఐ పై బ్యాన్ ఎత్తివేస్తాం. ట్రక్ డ్రైవర్లు దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రవాణా చట్టంను కొంతకాలం నిలిపివేయాలి. ట్రక్ యజమానుల సమ్మె పై కేంద్రం వెంటనే చర్చలు జరిపాలి. ఆటో డ్రైవర్లు బిఆర్ఎస్ ట్రాప్ లో పడకండి. ఓలా, ఉబర్, ర్యాపిడో, మెట్రో ఇతరత్రా అన్ని వచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడే వచ్చిందా? అయినా వారి సమస్యలను పరిష్కరిస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకిస్తున్నారా? బిఆర్ఎస్ స్పష్టం చేయాలి. ఆటో డ్రైవర్లతో చర్చలకు మేము సిద్ధం.

Leave a Reply