న‌న్ను, వేమిరెడ్డిని గెలిపించండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం

– అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో చూపిస్తాం
– నేను మాట‌ల మ‌నిషి కాదు..చేత‌ల మ‌నిషిని
– ఇండియాలోనే బెస్ట్ సిటీగా నెల్లూరుని తీర్చిదిద్దుతాం
– పెండింగ్ ప్రాజెక్టుల‌న్నీ కంప్లీట్ చేసి దోమ‌లు లేని న‌గ‌రంగా మారుస్తా
– ఆర్య‌వైశ్యులు, ప‌ద్మ‌శాలిల ఆత్మీయ స‌మావేశంలో మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌
– రామాల‌యంలో క‌లిశం ఊరేగించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన నారాయ‌ణ‌
– నారాయ‌ణ‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ఆర్య‌వైశ్యులు, ప‌ద్మ‌శాలిలు

రాబోయే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా న‌న్ను…ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని… అభివృద్ధి, సంక్షేమం అంటే మేం చూపిస్తామ‌ని..మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ఆర్య‌వైశ్యుల‌కి తెలిపారు. నెల్లూరులోని ఎస్‌బీఎస్ క‌ళ్యాణ మండ‌పంలో ఆర్య‌వైశ్యుల ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది. అలాగే అదే డివిజ‌న్‌లోని వీవ‌ర్స్ కాల‌నీ రామాయ‌వీధిలోని రామాల‌యంలో ప‌ద్మ‌శాలతో స‌మావేశ‌మ‌య్యారు.

అనంత‌రం ఆయ‌న‌…. నారా చంద్ర‌బాబు…తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అస‌లు రాజ‌కీయాల్లో ఎలా వ‌చ్చారో అన్న‌ది కూడా తెలియ‌జేశారు. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగానో అన్న‌ది కూడా వివ‌రించారు. 1993 నుంచి నేను నారా చంద్ర‌బాబుతో అసోసియేష‌న్ ఉండేద‌ని.. 1997, 1998, 1999లో నారా లోకేష్ చ‌దువు విద్య‌ను చెప్పాన‌ని…అప్ప‌టి నుంచి ఇంకా వారికి ఎంతో ద‌గ్గ‌ర అయ్యాయ‌ని గుర్తు చేశారు. అప్ప‌టి నుంచే నాకు హైద‌రాబాద్ లోని పార్టీ ఆఫీస్‌లో ఉండి పార్టీ కార్య‌క్ర‌మాలు అప్ప‌గించార‌న్నారు.

ఆ త‌రువాత ఎన్టీఆర్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ కి న‌న్ను డైరెక్ట‌ర్ గా తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. హైద‌రాబాద్ లోనే పేద ప్ర‌జ‌ల కోసం ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూల్‌ను డెవ‌ల‌ప్ చేశామ‌న్నారు. అలాగే 2014లో శ్రీ‌కాకుళం, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌కి న‌న్ను ఇన్‌చార్జిగా నియ‌మించారు. అక్క‌డ 34 సీట్ల‌కు గాను 25 సీట్లు గెల‌వ‌ప‌డం జ‌రిగింద‌న్నారు. అస‌లు నాకు…ఎమ్మెల్యే కావాల‌ని…ఎమ్మెల్సీ కావాల‌ని…మంత్రి కావాల‌న్న ఆలోచ‌నే లేద‌న్నారు. అంత‌క‌ముందు నాకు రెండు సార్లు రాజ్య‌స‌భకు చంద్ర‌బాబు అవ‌కాశం ఇచ్చినా నేను తీసుకోలేద‌న్నారు.

ఎడ్యుకేష‌న్ లో సేవ చేశావ్‌…రాజకీయాల్లో రావ‌చ్చు క‌దా…అని చంద్ర‌బాబే నాకు ఆఫ‌ర్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అప్పుడే నేను రాజ‌కీయాల్లో రావ‌డం జ‌రిగింద‌న్నారు. అయితే అమ‌రావ‌తి రాజ‌ధానిని…వ‌ర‌ల్డ్ లో ఉన్న టాఫ్ ఐదు రాజ‌ధానిల‌లో ఒక‌టి చేయాల‌ని చంద్ర‌బాబు చెప్పార‌న్నారు. 1979లో రిజ‌ల్స్ వ‌చ్చాయ‌ని…వీఆర్ కాలేజీలో పార్ట్ టైం జాబ్ ఉందంటే…నేరుగా వ‌చ్చి ఆనం భ‌క్త‌వ‌త్స‌ల‌రెడ్డిని క‌ల‌వ‌డం జ‌రిగింద‌న్నారు. వెంట‌నే ఆయ‌న న‌న్ను తీసుకోమ‌ని చెప్పార‌న్నారు.

పార్ట్ టైం లెక్చ‌ర‌ర్‌గా చేరాన‌ని…గంట‌కి నాలుగు రూపాయ‌లు ఇచ్చార‌ని…ఫ‌స్ట్ మూడు నెల‌లు నా జీతం రూ. 120లు అని ఆ రోజుల‌ జ్ఞాప‌కాల‌ను తెలియ‌జేశారు. పుట్టిన గ‌డ్డ‌కు నేను ఏదో ఒక‌టి చేయాల‌న్న ఉద్దేశంతోనే చంద్ర‌బాబును ఫండ్స్ అడ‌గ‌డం జ‌రిగింద‌న్నారు. అందుకు ఆయ‌న కూడా విడుద‌ల చేయ‌డం కూడా జ‌రిగింద‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం నేను అనేక దేశాలు తిరిగాన‌న్నారు. ఇత‌ర దేశాల్లో..అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ స్టోరేజి ఉండ‌డం వ‌ల‌నే దోమ‌లు అన్న మాట ఉండ‌ద‌న్నారు. అలాంటి సిస్ట‌మ్ నే నేను మున్సిప‌ల్ శాఖామంత్రి ఉన్న స‌మ‌యంలో రూ. 550 కోట్ల‌తో తీసుకువ‌చ్చాన‌న్నారు.

ఎల‌క్ష‌న్ కోడ్ రావ‌డంతో…చివ‌రిలో ఆగిపోయింద‌ని గుర్తు చేశారు. అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాట‌ర్ ప్రాజెక్టుల‌ను కోసం రూ. 1100 కోట్లు నిధులు తీసుకురావ‌డం జ‌రిగింద‌న్నారు. దానిని మేము హ‌డ్కో లోన్ తేవ‌డం వ‌ల్లే…ఈ ప్ర‌భుత్వం ఆపేసింద‌న్నారు. ఎందు కంటే…మ‌ళ్లీ మున్సిపాలిటీ క‌ట్టే విధంగా చేశామ‌న్నారు. అంత పెద్ద మొత్తం నెల్లూరు కార్పొరేష‌న్ భ‌రించ లేద‌ని అప్ప‌టి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లి… దానిని బ‌డ్జెట్‌లో పెట్టించాన‌న్నారు.

దీని వ‌ల్ల‌…నెల్లూరు ప్ర‌జ‌ల‌పై ఒక్క రూపాయి కూడా భారం లేకుండా చేశాన‌ని చెప్పారు. ప్ర‌స్తుత‌ ముఖ్య‌మంత్రిని అడిగి బ‌డ్జెట్ రిలీజ్ చేసుకోలేక‌…దానిని ఆపేశార‌ని ఆరోపించారు. 2024లో అధికారంలోకి రాగానే…చంద్ర‌బాబునాయుడుని అడిగి బ‌డ్జెట్ రిలీజ్ చేయించుకొని…ఖ‌చ్చితంగా రెండు ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి…నెల్లూరు సిటీని దోమ‌లు లేని న‌గ‌రంగా మారుస్తాన‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కి హామీ ఇచ్చారు. అదే విధంగా రాబోయే 30 ఏళ్ల‌ను దృష్టిలో పెట్టుకొని…డ్రింకింగ్ వాట‌ర్ ప్రాజెక్టు చేశాన‌న్నారు.
అలాగే నిరుపేద‌లంద‌రి సొంతింటి క‌ల‌ను ఖ‌చ్చితంగా నెర‌వేరుస్తాన‌ని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ల‌క్ష‌ల టిడ్కో ఇళ్ల‌ను మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అందులో 5 ల‌క్ష‌ల ఇళ్ల వ‌ర‌కు మా ప్ర‌భుత్వంలోనే పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని.. వాటిని కూడా ఈ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. మిగ‌తా వాటిని కూడా పూర్తి చేయ‌కుండా వ‌దిలేయ‌డం స‌రికాద‌న్నారు.

ఖ‌చ్చితంగా 54 డివిజ‌న్ల‌కు సంబంధించిన నిరుపేద‌లంద‌రికి 43వేల గృహాల‌ను ఇస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. రాబ‌యే ఎన్నిక‌ల్లో…తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మికి అండ‌గా నిల‌వాల‌ని ఆయ‌న ఆర్య‌వైశ్యుల్ని అభ్య‌ర్థించారు. ఈ స‌మావేశంలో టీడీపీ నాయకులు, కార్య‌క‌ర్త‌లు, ఆర్య‌వైశ్యులు పాల్గొన్నారు

Leave a Reply