– సీసీఐ సిఎండి లలిత్ కుమార్ గుప్తాతో మంత్రి తుమ్మల
హైదరాబాద్: జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై సీసీఐ సిఎండి లలిత్ కుమార్ గుప్తా తో ఫోన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రదించారు. పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు యథావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ సిఎండి కి మంత్రి విజ్ఞప్తి చేశారు. తేమ శాతం స్లాట్ బుకింగ్ పై పత్తి రైతుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సిఎండి దృష్టికి తీసుకువెళ్ళారు. జిన్నింగ్ మిల్లర్లు లేవనెత్తిన డిమాండ్స్ పై సీసీఐ సిఎండి కి వివరించారు. ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే పత్తి కొంటామనే నిబంధన ఎత్తి వేయాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సీసీఐ సిఎండి కి మంత్రి తుమ్మల సూచించారు.
రైతులు ఇబ్బంది లేకుండా పత్తి తేమ శాతం 12 శాతం పైగా ఉన్న కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ సిఎండి కి విన్నవించారు. సీసీఐ కొత్త నిబంధనలు జిన్నింగ్ మిల్లర్లు సమస్యలపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. అలాగే, జిన్నింగ్ మిల్లులు అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తో మంత్రి తుమ్మల ఫోన్ లో మాట్లాడారు. రైతులు, ప్రజాప్రతినిధుల విజ్ఙప్తి మేరకు ఈ సీజన్ లో మక్కల దిగుబడి అధికంగా ఉన్న నేపథ్యంలో ఎకరానికి 25 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని మార్క్ ఫెడ్ ఎండిని మంత్రి తుమ్మల ఆదేశించారు. వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.