Suryaa.co.in

Andhra Pradesh

లిక్కర్ స్కాం…ఆంధ్రా టు ఆఫ్రికా!

– టాంజానియాకు విస్తరించిన లిక్కర్ సొమ్ము వ్యాపారం

(రమేష్)

మద్యం స్కామ్ డబ్బుతో టాంజానియా దేశంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం అలాగే ఆఫ్రికాలో ముడి ఖనిజాల వ్యాపారం నిమిత్తం చెవిరెడ్డి భాస్కరరెడ్డి ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్టు మద్యం స్కాం మీద విచారణ జరుపుతున్న సిట్ కి స్పష్టమైన సాక్ష్యాలు దొరికినట్టు సమాచారం

ఇంకా కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావాలి అని అనుకుంటున్నా..

వైఎస్ కుటుంబానికి వైసిపి నాయకులకు ఆఫ్రికా దేశాలతో ఆర్థిక అనుబంధం ఏర్పాటు జరిగి దాదాపు రెండు దశాబ్దాలు గడిచాయి..

2004-09 మధ్య వైఎస్ గారి హయంలో నాటి ప్రభుత్వ సలహాదారుడు గా ” విసు కన్సల్టెన్సీ” అధినేత సిసి రెడ్డి గారి నియామకం జరిగింది అనేది గుర్తు చేసుకుందాము..

ఇక్కడ ఎవరు ఈ సిసి రెడ్డి అనే అనుమానం కలగడం కూడా సహజం..

వైఎస్ గారికి YS జార్జి రెడ్డి అనే అన్న ఉండేవారు( వారు చాలా కాలం క్రితమే చనిపోయారు)..

ఈ సిసి రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు భారతి గారు జార్జి రెడ్డి గారి సతీమణి..

అంటే వైఎస్ గారికి స్వయానా తన అన్నకు బావమరిది ఈ సిసి రెడ్డి గారు..

ఈ బంధుత్వం ఇక్కడితో ఆగలేదు..

వైఎస్ గారి చిన్న తమ్ముడు వైఎస్ సుధీకర్ రెడ్డి గారికి సిసి రెడ్డి గారి కూతురును ఇచ్చారు..

ఈ సుధీకర్ రెడ్డి గారు మంచు విష్ణుకి పిల్లను ఇచ్చిన మామ గారు..

సో వైఎస్ కుటుంబానికి రెండు విధాలా ఈ సిసి రెడ్డి గారు కీలక బంధువు..

ఈయన ప్రభుత్వ సలహాదారుడుగా నియామకం పొందిన తరువాత కెన్యా దేశంలో సారవంతమైన భూములు ఉన్నాయి నీటి వసతి వున్నది చవకైన లేబర్ దొరుకుతారు కానీ అక్కడి వారికి వ్యవసాయ అనుభవం పరిజ్ఞానం లేదు కాబట్టి అటువంటి అనుభవం కలిగిన రైతులు ఇక్కడి నుంచి ఆసక్తి కలిగిన వారు ముందుకు వస్తె ఒక్కొక్కరికి 1000 ఎకరాలు చొప్పున అక్కడి ప్రభుత్వం భూమి ఉచితంగా కేటాయింపు చేస్తుంది కావున అలా ఆసక్తి కలిగిన షుమారు 1000 మంది రైతులను ఎంపిక చేసుకుని వారిని కెన్యా పంపించనున్నాము అని సిసి రెడ్డి గారు చాలా ఘనంగా ప్రకటించారు..

అయితే ఆ రోజుల్లో ఏ జిల్లా నుంచి ఏ రైతులను ఎంపిక చేసి అలా కెన్యా పంపారు అనే సమాచారం మనకు ఎవరికి లేదు కానీ సిసి రెడ్డి గారి మేనల్లుళ్లు ఇరువురు అంటే YS జార్జి రెడ్డి గారి కొడుకులు YS అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి మాత్రం దక్షిణ ఆఫ్రికాలో డిస్టిలరీలు ఏర్పాటు చేసారు అనేది మనకు అందరికి తెలిసిందే..

అలాగే సిసి రెడ్డి గారి మిగిలిన బంధువర్గం కూడా వైఎస్ హయంలోనే ఆఫ్రికాలో ఇంకా కొన్ని దేశాలలో వేలాది ఎకరాలు( నేను విన్నది అయితే కాంగో లో లక్షలాది ఎకరాలు) మైన్స్ దక్కించుకున్నారు అని అందులో వజ్రాల గనులు కూడా వున్నాయి అని ఆరోజుల్లో కొన్ని వర్గాలలో చాలా చాలా చర్చనీయాంశం అయ్యింది..

సో ఆఫ్రికాలో ఇంతటి ఆర్థిక వ్యాపార చుట్టరికం పెంపొందించుకున్న ఈ ముఠా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది వాళ్ళ స్థాయికి చాలా చిన్న విషయం..

ఇక్కడ అడ్డదిడ్డంగా దోచేసిన సంపాదన అడ్డదారుల్లో విదేశాలకు తరలించి అక్కడ వారి సంపద పోగుచేసుకోవచ్చు అనే విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు ఆరితేరిపోయారు..

మా పిల్లలు చదువుకున్నారు వారికి విదేశాలలో మంచి మంచి కెరీర్లు దక్కాయి అని గొప్పలు చెప్పుకునే వారి ఆస్తిపాస్తులు మొత్తం కలిపినా ఈ ముఠాల ప్రహరీ గోడ ఖరీదు చేయవు..

మన ఖర్మ ఏంటంటే ఈ అడ్డదిడ్డ సంపదతో అడ్డంగా బలసిన సొమ్ముతో వీళ్ళు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు..

వీళ్ళ డబ్బుకు కీలక వ్యవస్థలు అన్నీ దాసోహం అంటున్నాయి..

మరి ఇంతటి బాహాటపు బరితెగింపు కళ్ల ముందే కనిపిస్తున్నా ఇంకా ఎన్నాళ్ళకు ఎన్నేళ్లకు చర్యలు తీసుకునే అధికారం వున్న వారు స్పందిస్తారో చూడాలి..

వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలి అన్నా విజన్ 2047 లక్ష్యం నెరవేరాలి అన్నా ముందుగా ఈ దోపిడీకి తగిన మూల్యం చెల్లింప చేసి తీరాలి లేనప్పుడు money makes many things అని బలంగా నమ్ముతున్న ఈ ముఠా ప్రజాస్వామ్యానికి సమాజానికి ఎప్పటికీ ప్రమాదమే.

LEAVE A RESPONSE