Suryaa.co.in

Andhra Pradesh

యువత పోరు కాదు .. వైసిపి పార్టీ ఉనికి పోరు

– జగన్ హయాంలో యువతకు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా?
వైసిపి పార్టీ నాయకులకు గంజాయి దొరకట్లేదని పోరు
– నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్

తాడేపల్లి: జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో యువత కోసం చేసింది శూన్యమని వారు 2019 ఎన్నికల్లో చెప్పిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని ఏటా జాబ్ క్యాలెండర్,ఏటా 6500 పోలీసు ఉద్యోగాలు భర్తీ,జగన్ వస్తే మెగా డీఎస్సీ ఇస్తామని దగా చేసి కనీసం ఒక్క ప్రైవేట్ ఉద్యోగాన్ని కల్పించలేక, యువతకు గంజాయికి,మందుకు బానిస చేశారే తప్ప యువత భవిష్యత్తు పైన ఎలాంటి శ్రద్ధ చూపలేదన్నారు.

వారి హయాంలో గ్రూప్ 1 ప్రశ్నా పత్రాల మూల్యాంకనం డ్రైవర్లు, వెల్దర్లు,ఇంటి పనివారితో దిద్దించి నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేశారే తప్ప మేలు చేయలేదన్నారు.ఓటమి ఓర్వలేక యువత పోరు పేరుతో ధర్నాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు నిజంగా ఏదైనా నిరుద్యోగుల కోసం మేలు చేసి ఉంటే బహిరంగ చర్చకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అని షేక్ సిద్ధిక్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE