Suryaa.co.in

Andhra Pradesh

ఏది వృధా జగన్?

యోగ అనే ప్రక్రియ భారతీయ జీవనవిధానం. హిందూ సనాతన జీవన శైలిలో అంతర్భాగం. దానిని అవహేళన చెయ్యడం, పనికిమాలిన పని అనడం, డబ్బు దండగ అనడం వైసీపీ నాయకుని అవివేకం చాటుతుంది. ప్రపంచంలో అనేకమంది, అనేక దేశాలు మన యోగా, మన ఆచార వ్యవహారాలు భేష్ అంటుంటే, మన వైసీపీ వీరుడు దానిని తక్కువ చేసి మాట్లాడుతుంటే, అతని సంస్కారానికే వదిలేయాలి.

ఏది వృధా?.

నీ పరిపాలనలో ప్రజాధనం ఎంత వృధా చేసావో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు యావత్ ప్రపంచానికి తెలుసు. పంచాయితీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేశావు ₹ 1500 కోట్లు ఖర్చుబెట్టి. సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే, మరో ₹1500 కోట్లు ఖర్చుబెట్టి రంగులు తొలిగించావు. మొత్తం ₹3000/- కోట్లు ఖర్చుపెట్టావు. మరి దీనిని వృధా కాక ఏమంటారు?.

సర్వే రాళ్లపై 4000 కోట్లు ఖర్చుపెట్టి నీ బొమ్మలు చెక్కించుకున్నావు. అవి పాతడానికికూడా వీలు లేకుండా పనికిమాలిన పని చేసావు.దీనిని వృధా అనరా.?

సెంట్ ఇండ్ల పట్టాలు ఇస్తానని చెప్పి 10 లక్షలకు కూడా పనికిరాని భూములకు 40 లక్షలనుండి 80 లక్షలు ఎక్కువ రేటుకుకొని నువ్వు, నీ MLA లు కమిషన్ కు కక్కుర్తి పడి నీట మునిగే భూములు, స్మశాన భూములు, ఆవభూములు కొని ప్రజల సంపదను కొల్లగొట్టి కోట్లు గడించాదాన్ని వృధా అనరా?.

వాలంటీర్ వ్యవస్థను తయారు చేసి ప్రజా డబ్బుతో వైసీపీ పార్టీ పనికి ఉపయోగించడం డబ్బు వృధా కాదా?.

మద్యం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టి, నువ్వే మద్యాన్ని అమ్మి, ప్రజల ఆరోగ్యాన్ని హరింప జేయడాన్ని ఏమంటారు.?.

ప్రజాసంపద వృధా అనరా.?

వందలాది మందిని, పనికిమాలిన వారిని నీ వైసీపీ అనునాయులుని ప్రభుత్వ సలహాదారులుగా నియమించి, వారివల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేకపోయినా కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును వారికి నెల నెల జీతం రూపంలో కృష్ణర్పణం గావించడం డబ్బు వృధా అనరా.?.

ఉచితంగా దొరికే ఇసుకను GO లద్వారా కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువరేటుకు ఇతర రాష్ట్రాలకు తరలించి ప్రభుత్వ ఆదాయనికి గండికోట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యడం అనరా?.

4 లక్షల కోట్లు ఉన్న అప్పును 5 సంవత్సరములలో ₹10 లక్షల కోట్లు అప్పులు పెంచి ఒక్క సంపద కూడా సృష్టించలేని నీ పరిపాలన వృధా అనరా.? దీనినే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటారు.

నీ అవినీతి భరించలేకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను 2024 అసెంబ్లీ ఎన్నికలలో 164 ఫీట్ల లోతులో పాతిపెట్టారు. అయినా సిగ్గు రాలేదు. ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే ఏ ఎన్నికలలో కూడా ఇంకా 11 ఫీట్లు లో పాతి పెడతారు భవిష్యత్తు లో.

– నలమోలు వెంకట శివరామ ప్రసాద్

LEAVE A RESPONSE