క్రికెట్ అభిమానుల కోసం సానా సతీష్ బాబు ప్రత్యేక ఏర్పాట్లు
సామర్లకోట: మహిళల వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్లో భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రసవత్తర పోరును వీక్షించేందుకు క్రికెట్ అభిమానుల కోసం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు సామర్లకోట మండలంలోని కొప్పవరం గ్రామంలో గల సానా సతీష్ బాబు కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
భారత జట్టు విజయం కోసం స్థానికులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఉత్సాహంగా జోష్ నింపారు. కార్యాలయం ఆవరణ మొత్తం “జై భారత్”, “గో ఇండియా గో” నినాదాలతో మార్మోగింది.