ఎన్డీయే కూటమికి లోక్ సత్తా మద్దతు

-నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు
-అరాచక పాలనకు చరమగీతం పాడి, అభివృద్ది, సంక్షేమాన్ని -సమాంతరంగా తీసుకెళ్లే వారికి ఓటు వేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపు

టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి పొత్తుతో ఎన్నికలకు వెళుతున్నాయి.ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తారని విశ్వసిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ది, ఉపాధి, పరిశ్రమలకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉంది. లోక్ సత్తా కూడా యన్డీఎ కూటమికి మద్దతు ఇస్తుంది. ప్రజలు, మేధావులు, రైతులు అందరూ ఆలోచించి రాష్ట్రానికి, మీ పిల్లలకు మంచి చేసే యన్డీఎ కూటమిని గెలిపించండి. రేపు నా మీద కూడా చాలా పెద్ద పెద్ద విమర్శలు వస్తాయి. నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు. నేను నిజాయతీగా రాష్ట్రం, భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం ప్రకటించా.

Leave a Reply