Suryaa.co.in

Andhra Pradesh

లోకేషన్నా.. ప్లీజ్ నన్ను వదిలేయండి

– నేను వైసీపీ సభ్యురాలిని కాదు
– నా వ్యాఖ్యలు నష్టం చేస్తాయని ఊహించలేదు
– వారం రోజులుగా తిండీ నిద్ర లేకుండా కుమిలిపోతున్నా
– పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా
– మంత్రి లోకేష్ కు నటి శ్రీరెడ్డి లేఖ
– సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న శ్రీరెడ్డి లేఖ

అమరావతి: అనుభవమైతేగానీ తత్వం బోధపడదన్న విషయం నటి శ్రీరెడ్డికి ఆలస్యంగా అర్ధమయినట్లుంది. జగనన్న జమానాలో టీడీపీ-జనసేన నేతలపై రెచ్చిపోయి పచ్చిబూతులు మాట్లాడిన శ్రీరెడ్డిపై, ఇప్పుడు ఏపీలో అనేక పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి.

దానితో బెంబేలెత్తిన శ్రీరెడ్డి.. మంత్రి లోకేష్‌కు రాసిన లేఖలో ‘లోకేషన్నా నన్ను క్షమించు. అసలు నేను వైసీపీ సభ్యురాలినే కాదంటూ ఓ లేఖ రాసింది. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

తనను క్షమించాలంటూ ఇటీవల వీడియో విడుదల చేసిన నటి శ్రీరెడ్డి.. తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్, మంత్రి లోకేశ్‌కు కలిపి ఒకే లేఖ రాశారు. అందులో తొలుత జగన్‌ గురించి ప్రస్తావిస్తూ, జగన్భారతీరెడ్డిని దగ్గరి నుంచి చూసే అదృష్టం తనకు దక్కలేదని, టీవీల్లో చూసి ఆనందిస్తుంటానని పేర్కొంది.

పార్టీలో తాను సభ్యురాలిని కాకపోయినా తన వాణిని బలంగా వినిపించా. అయితే, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయా. ఇప్పుడు తప్పు తెలుసుకుని పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది.

లోకేశ్ అన్నా అని సంబోధిస్తూ ఇకపై తాను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని, తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, తనను క్షమించాలని వేడుకుంది. వారం రోజులుగా తిండీ నిద్ర లేకుండా కుమిలిపోతున్నా. తనతోపాటు తన కుటుంబ సభ్యులు వేల సంవత్సరాలకు సరిపడా క్షోభ అనుభవించారని, తనను వదిలివేయాలని విజ్ఞప్తి చేసింది. మొత్తానికి అమ్మడికి కేసులు పడితే గానీ జ్ఞానోదయం రాలేదన్నమాట.

LEAVE A RESPONSE