Suryaa.co.in

Andhra Pradesh

క‌త్తితో బతికితే క‌త్తితోనే చ‌స్తావు జ‌గ‌న్ మాఫియా రెడ్డీ…

– జ‌గ‌న్ మాఫియా రెడ్డి…భ‌యం మా బ‌యోడేటాలో లేదు
– నాటి డిజిపి గౌత‌మ్ స‌వాంగ్ ఎక్క‌డున్నాడో చూడండి
– వైసీపీ దాడుల్లో మృతిచెందిన టిడిపి కుటుంబాల‌న్నింటినీ ఆదుకుం
-టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

ప‌ల్నాడులో వైసీపీ మూక‌ల చేతిలో దారుణ‌హ‌త్య‌కి గురైన జ‌ల్ల‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి, 25 ల‌క్ష‌ల సాయాన్ని అంద‌జేశారు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. అక్ర‌మ‌కేసుల‌తో, దాడుల‌తో టిడిపిని భ‌య‌పెట్టాల‌ని జ‌గ‌న్ మాఫియా రెడ్డి చూస్తున్నారు.
భ‌యం తెలుగుదేశం పార్టీ బ‌యోడేటాలో లేదు. ప్ర‌భుత్వ అరాచ‌కాల్ని, అవినీతిని ప్ర‌శ్నిస్తే టిడిపిపై దాడుల‌కి పాల్ప‌డుతున్నారు. అన్ని అనుమ‌తులు వున్నా అయ్య‌న్నపాత్రుడు ఇంటి గోడ కూల్చారు కోర్టుకెళితే చ‌ట్టాల‌ని ఉల్లంఘించిన సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది.

శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వ‌ర‌కూ రాష్ట్ర‌మంతా టిడిపి నేత‌ల‌పై అక్ర‌మ కేసుల్లో అరెస్ట్ చేయించారు. చివ‌రికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంపై వైకాపా కుక్క‌లు దాడికి బ‌రితెగించాయి. 2019 ముందు నాపై ఒక్క కేసూ లేదు. జ‌గ‌న్‌రెడ్డి 14 కేసులు పెట్టించాడు. వైసీపీ స‌ర్కారు పెట్టే దొంగ కేసుల‌కీ, కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కీ తెలుగుదేశం భ‌య‌ప‌డ‌దు. భ‌యం మా బ‌యోడేటాలో లేదు జ‌గ‌న్ మాఫియా రెడ్డి. మీ అయ్య కూడా ఇలాగే మ‌మ్మ‌ల్ని భ‌య‌పెట్టాల‌ని అనుకున్నాడు. క‌త్తితో బతికితే క‌త్తితోనే చ‌స్తావు జ‌గ‌న్lokesh1 మాఫియా రెడ్డీ. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడితే మాపైనే దొంగ కేసులా? అధికారులూ ఆలోచించుకోండి..జ‌గ‌న్ మాఫియారెడ్డి శాశ్వ‌తం కాదు..వ్య‌వ‌స్థ‌లు శాశ్వ‌తం. జ‌గ‌న్‌రెడ్డి కోసం అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించిన నాటి డిజిపి గౌత‌మ్ స‌వాంగ్ ఎక్క‌డున్నాడో చూడండి. జ‌గ‌న్ మాఫియా రెడ్డి గౌత‌మ్ స‌వాంగ్‌ని వాడి ప‌డేశాడు. ఎన్టీఆర్ దేవుడు..చంద్ర‌న్న రాముడు…వైసీపీ నేత‌ల పాలిట నేను మూర్ఖుడిని.. ఈ రోజు వైసీపీ పెద్ద‌ల ఆదేశాల‌తో చ‌ట్టాన్ని ఉల్లంఘించి టిడిపిపై దాడిచేసిన ఏ ఒక్క‌డినీ వ‌ద‌లం.

2014 నుంచి 2019 వ‌ర‌కూ ఎవ్వ‌రినీ ఏమీ అన‌లేదు. మా చంద్ర‌న్న ఆ రోజు చిటికె వేస్తే జ‌గ‌న్ మాఫియా రెడ్డి పాద‌యాత్ర చేయ‌గ‌లిగేవాడా? మాచ‌ర్ల‌లో ఐదుగురు టిడిపి కార్య‌క‌ర్త‌ల్ని ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి చంపించాడు. వీరిలో న‌లుగురు బ‌డుగుబ‌ల‌హీన‌వ‌ర్గాల వారినే ఎంచుకుని మ‌రీ చంపేశారు. చుట్టూ పోలీసుల్ని పెట్టుకుని టిడిపిపై దాడులు చేస్తున్న‌ పిన్నెల్లి ఇంటి పేరు పిల్లిగా మార్చుకో.. మాlokesh2 కార్య‌క‌ర్త‌ల్ని చంపుతావా…అక్ర‌మ కేసులు పెడ‌తావా? ఇన్ని అరాచ‌కాలు చేసే నువ్వు ఎక్క‌డికి పారిపోతావో చూస్తాం. ఆంద్ర‌ప్ర‌దేశ్ కాదు..భార‌త‌దేశ‌మే కాదు..ప్ర‌పంచంలో ఎక్క‌డున్నా నిన్ను లాక్కొస్తాం.నీ క‌ల్తీ మ‌ద్యం, గుట్కా, గ్రానైట్ దందాల‌న్నీ బ‌య‌ట‌పెడ‌తాం. ప్ర‌త్యేక‌బృందాలు ఏర్పాటు చేసి ద‌ర్యాప్తు చేసి పిన్నెళ్లిని శాశ్వ‌తంగా జైలుకి పంపుతాం. పోలీసుల అండ‌తో దొంగ కేసులు పెట్ట‌డం కాదు పిన్నెల్లి..ద‌మ్మూ ధైర్యం ఉంటే డైరెక్ట్‌గా రా.. మా బ్ర‌హ్మారెడ్డిని చూస్తే ఉచ్చ‌పోసుకుని వ‌ణికిపోతావు. మాచ‌ర్ల‌లో ఎవ్వ‌రు ఏ ప‌నిచేయాల‌న్నా పిల్లికి, పిల్లి త‌మ్ముడు సైకోరెడ్డికి క‌ప్పం క‌ట్టాలి. వైసీపీ ఎమ్మెల్యే అయ్యింది ప్ర‌జ‌ల్ని చంపడానికి, ప్ర‌జ‌ల్ని పీడించ‌డానికి, ప్ర‌జాధ‌నం దోచుకోవ‌డానికేనా ?

మేం ఫిర్యాదు చేస్తే క‌నీసం కేసు న‌మోదు చేయ‌ని పోలీసులు టిడిపి కార్య‌క‌ర్త‌ల్ని వైసీపీ వాళ్లు చంపితే నిందితుల్ని ర‌క్షించ‌డానికి వ‌స్తున్నారు.జ‌ల్ల‌య్య‌ని అత్యంత దారుణంగా వైసీపీ వాళ్లు చంపితే కుటుంబానికి మృత‌దేహం ఇవ్వ‌టంలేదు జ‌గ‌న్‌రెడ్డి మెప్పుకోసం అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఖాకీ యూనిఫాంకి చెడ్డ‌పేరు తెస్తున్నారు పోలీసులు. చంపిన వాళ్ల‌పై కాకుండా…చంపినోళ్లు చెప్పిన‌వాళ్ల‌పై కేసులు పెట్టారు పోలీసులు. నీ దాడుల‌కి భ‌య‌ప‌డ‌టానికి ఇదేదో పేటీఎం బ్యాచ్ కాదు …డ‌బ్బులు ప‌డేస్తే వ‌చ్చేవాళ్లు కాదు.. ప‌సుపు జెండా చూస్తే వైసీపీకి ఉచ్చ ప‌డుతోంది. గ‌డ‌ప‌గ‌డ‌ప‌లో వైసీపీని ప్ర‌జ‌లే నిల‌దీస్తున్నారు. రాబోయే రోజుల్లో జ‌గ‌న్‌మాఫియారెడ్డిని త‌రిమి త‌రిమి కొడ‌తారు. నా త‌ల్లి గురించి మాట్లాడించిన జ‌గ‌న్‌రెడ్డికి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు వున్నారు. వారి గురించి మేము మాట్లాడొచ్చు..కానీ అది టిడిపి సంస్కారం కాదు. జ‌గ‌న్ త‌ల్లి, చెల్లి, ఇద్ద‌రు కూతుర్ల‌నీ మేము గౌర‌వించాం. జ‌ల్ల‌య్య పిల్ల‌ల్ని నేనే చ‌దివిస్తాను. వైసీపీ దాడుల్లో మృతిచెందిన టిడిపి కుటుంబాల‌న్నింటినీ ఆదుకుంటాం.

LEAVE A RESPONSE