Suryaa.co.in

Andhra Pradesh

వీధుల్లో రంకెలేయడం కంటే.. కోర్టుల్లో మీ నిజాయితీని నిరూపించుకోవచ్చుకదా లోకేష్ ..?

– నిజాయితీపరులైతే చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరిలు తమ ఆస్తులపై విచారణ కోరవచ్చు కదా?
– 17ఏ గురించి సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అయిన గవర్నర్ కు పొలిటికల్ పప్పు ఫిర్యాదా?
– బాబు అవినీతికి వారసుడు లోకేష్
– మీ నాన్న(బాబు) చేసింది పదుల కోట్లు కాదు వేల కోట్ల అవినీతి
– జీరో లోకేశ్…హీరో జగన్ పై విమర్శలా?
– కన్ను, కాలు బాగోలేదంటే బాబుకు బెయిల్ వచ్చింది…లీగల్ గ్రౌండ్స్ పై కాదు
– మంత్రి జోగి రమేశ్

నాటి అధికార మదం గుర్తులేదా..లోకేశ్‌..?
చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేశ్‌ ఈరోజు రాజ్‌భవన్‌ దగ్గర గుక్కపట్టి ఏడుస్తూ కనిపించాడు. ఆయనతో పాటు టీడీపీలో తలపండి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న నాయకులూ ఏడ్చారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై గౌరవ గవర్నర్‌ ని కలిసి వివరించినట్లు వారు చెప్పుకున్నారు. నోట్లో వేలు పెడితే కొరకలేని మా నాన్న చంద్రబాబును అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారంటూ.. జైల్లో పెట్టి బెయిల్‌ రాకుండా చేస్తున్నట్లు మా మీదపడి లోకేశ్‌ ఏడ్చాడు. ఆయన మాటలు విని ప్రజలంతా నవ్వుకుంటున్నారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు ఖూనీ చేసిన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విలువల గురించి వీళ్లు ఇప్పుడు మాట్లాడుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ప్రజల్లోనే చర్చ జరుగుతుంది.

వెంటాడుతున్న పాపాలే ఇవి
రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు గురించే మాట్లాడే ముందు లోకేశ్‌ మీ నాన్న చరిత్ర గురించి ఒక్కసారి వెనక్కి వెళ్లి గుర్తుకు తెచ్చుకోవడం మంచిది. మీ తాత ఎన్టీఆర్‌ను మీ నాన్న వెన్నుపోటు పొడిచిన దగ్గర్నుంచీ 2014 ఎన్నికల్లో గెలిచిన 23 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్ని అధికార మదంతో కొనుగోలు చేసి మీ దొడ్లో కట్టేసుకున్నారు గదా..? మా పార్టీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల్లో కొందరికి మంత్రి పదవులు సైతం కట్టబెట్టి ప్రమాణస్వీకరాం చేశారు కదా..? మరి, అప్పుడు మీకు రాజ్యాంగ విలువలు గుర్తుకురాలేదా..? ప్రజాస్వామ్యం మిమ్మల్ని ప్రశ్నించలేదా..? మీ నాన్న చంద్రబాబు చేసిన పాపాలన్నీ గవర్నర్‌ గారికి చెబితే చాలా బాగుండేది. ఆనాడు మీరు అధికార మదంతో.. సామాజికవర్గ అహంకారంతో కన్నుమిన్ను కానకుండా చేసిన పాపాలే నేడు మిమ్మల్ని వెంటాడుతున్నాయని తెలుసుకో లోకేశ్‌.

ఆధారాలతో దొరికిన దొంగ చంద్రబాబు
చంద్రబాబు నాయుడు స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో భారీస్థాయి అవినీతికి పాల్పడి ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన దొంగ. కనుకే, ఆయన్ను గౌరవ న్యాయస్థానాలు రిమాండ్‌కు తరలించాయి. ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్న ఖైదీ. ఇదిలా ఉంటే, లోకేశ్‌నేమో..మా నాన్నను రూ.27 కోట్లుకే అరెస్టు చేస్తారా..? అంటాడు. అవినీతికి ఒక స్థాయి ఉండాలనేది లోకేశ్‌ అనుకుంటున్నాడా..? స్కిల్‌ స్కామ్‌లో మొత్తం రూ.3700 కోట్లు మింగేసేందుకు రచించిన పథకం అని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. పేరున్న సీమెన్స్‌ సంస్థను తెరమీదికి తెచ్చి షెల్‌ కంపెనీల ద్వారా ప్రభుత్వ ఖజానాను అడ్డంగా దోచుకున్న దొంగ చంద్రబాబు. అరెస్టులో, రిమాండ్ లో అన్యాయం, అక్రమం ఏముంది..?

మెడికల్‌ గ్రౌండ్‌తోనే బెయిల్
చంద్రబాబును ఈ స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టు చేసిన దగ్గర్నుంచీ, జైలు రిమాండ్‌కు పెట్టడం వరకు స్పెషల్‌ ఫ్లైట్‌లు పెట్టుకుని మరీ సిద్దార్థ లూథ్రా వంటి న్యాయవాద దిగ్గజాల్ని పిలిపించుకున్నారు కదా..? మరి, మీరు కోరుకున్నట్లు రిమాండ్‌ తిరస్కరణ ఎందుకు జరగలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో బెయిల్, క్వాష్‌ పిటీషన్లు వేశారు కదా..? వాటిని ఎందుకు న్యాయస్థానాలు తోసిపుచ్చాయి..? వీటికి సమాధానం చెప్పు. లీగల్‌ మెరిట్స్‌తో ఎటూ బెయిల్‌ పొందలేకపోతున్నామని.. కన్ను బాగలేదని, కాలు పనిచేయడం లేదని.. ఆపరేషన్‌ చేయించుకోవాలంటూ కోరితే.. మెడికల్‌ గ్రౌండ్‌లోనే చంద్రబాబుకు బెయిల్‌ వచ్చింది తప్ప లీగల్‌ గ్రౌండ్‌లో కాదు.

ఈడీ, ఐటీ నోటీసులు మీ పెద్దమ్మ కుట్రా?
రాజకీయ కక్షసాధింపుతోనే చంద్రబాబు జైలు పాలయ్యాడని చెప్పుకోవడం సరైంది కాదు. ఇదే స్కిల్‌స్కామ్‌కు సంబంధించి ఈడీ కొందర్ని ఇప్పటికే అరెస్టు చేసింది. ఐటీ శాఖ సైతం రూ.118కోట్లకు లెక్కలు చెప్పాలని చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది కదా..? సీఐడీకి జగన్ గారు బాధ్యులైతే…మరి, ఈడీ, ఐటీ సంస్థలకు మీ పెద్దమ్మ బాధ్యురాలా? బహుశా..మీ పెద్దమ్మ చంద్రబాబు మీద చాలా కసితో ఉండి ఆమెనే నీ తండ్రిని జైల్లోకి తోయించి, బెయిల్‌ రాకుండా చేస్తుందేమోననే అనుమానం ఉంది. దీనిపై కూడా లోకేశ్‌ మాట్లాడితే బాగుంటుంది.

బాబు ఒక జాతికి అధ్యక్షుడే..
కోర్టు స్టేల మీద బతుకున్న చంద్రబాబు పాపం ఇన్నాళ్లకు పండింది. చంద్రబాబు ఏ జాతికి అధ్యక్షుడు..? ఆయన తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడా.. ఒక సామాజికవర్గ జాతికి అధ్యక్షుడా..? అధికారంలో ఉన్నన్నాళ్లూ ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి.. రాజ్యాంగ విలువల్ని పట్టించుకోకుండా.. సొంత సామాజికవర్గ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన వ్యక్తి అతను. అధికారం కోల్పోయినప్పుడే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకు వస్తాయా..? ఇప్పటికైనా వాస్తవాల్ని తెలుసుకుని టీడీపీ నేతలు, లోకేశ్‌ విషప్రచారాన్ని ఆపితే బాగుంటుందని హెచ్చరిస్తున్నాను. మీ వ్యూహాలు, కుట్రలకు కాలం చెల్లింది. 2024 ఎన్నికల్లో మీ అడ్రస్‌ గల్లంతు కాక తప్పదు.

జగన్‌ గురించి మాట్లాడే అర్హతేలేదు
కనీసం వార్డుమెంబర్‌గా కూడా గెలవలేని లోకేశ్‌.. భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో పార్లమెంట్‌ సభ్యునిగా గెలిచిన జగన్‌ గారి ప్రస్తావన చేయడం సిగ్గుచేటు. ఆయనకు జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదు. ప్రజల గుండెల్లో చెదరని గుర్తింపు తెచ్చుకున్నారు కనుకే జగన్‌ హీరో అయ్యారు. ఈ లోకేశ్‌ మాత్రం మంగళగిరిలో గెలవలేని జీరో. అలాంటి లోకేశ్‌ మా నాయకులు జగన్‌ ప్రస్తావన తెస్తే.. నక్కకూ నాకలోకానికున్నంత తేడా ఉంటుంది. అలాంటి లోకేశ్‌ ఎవర్నో తొక్కుకుంటూ పోతానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. నువ్వు తొక్కేది ఎవర్నీ..? ఆల్రెడీ.. నీ తండ్రి చంద్రబాబును, మీ పార్టీని 2019లో ప్రజలే తొక్కి తొక్కి నార దీశారని తెలుసుకో..

LEAVE A RESPONSE