-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రారు. అధికారులు బెదిరించి తెచ్చిన వారూ పారిపోతున్నారు. ఈ వాస్తవాలు రాసే, చూపించే మీడియా ప్రతినిధులు వీపు వాయగొడతారా మేయర్ గారు! ఇదేం రౌడీయిజం? అధికారం మత్తులో నోరు పారేసుకోవద్దు. వీపులు మీడియా వాళ్లకే కాదు, మీకూ వుంటాయి. ఎప్పుడు మీ వీపులు విమానం మోత మోగిద్దామా అని నాలుగు కోట్లకి పైగా వున్న ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారు. మర్యాదగా మీడియా ప్రతినిధులకి క్షమాపణ చెప్పండి.