Suryaa.co.in

Andhra Pradesh

ఓడిపోయినా నియోజకవర్గాన్ని వీడిపోని యువనేత

-మన లోకేష్‌ అని నినదించిన మంగళగిరి 
– పాదయాత్రతో ఇంటింటికీ తిరిగిన లోకేష్‌
– అపార్ట్‌మెంట్‌ వాసులు, వీధుల్లో రచ్చబండ సమావేశాలు
– తటస్థుల ఇళ్లకు వెళ్లి సర్వతోముఖాభివృద్ధికి కలిసిరావాలని పిలుపు

అమరావతి: మంగళగిరి నియోజవర్గానికి 2019లో సరిగ్గా ఎన్నికలకు 20 రోజు లు ముందు టీడీపీ అభ్యర్థిగా వచ్చారు నారా లోకేష్‌. ఆ ఎన్నికల్లో 5 వేల పైచి లుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా మంగళగిరి నియోజవర్గాన్ని వీడిపోలే దు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతీ ఇల్లూ, ప్రతీ వీధి, ప్రతీ ఊరు, ప్రతీ వర్గంని పలకరించి బాగోగులు తెలుసుకున్న యువనేత వారి ఆకాంక్షలు తెలుసు కున్నారు. ప్రజల సమస్యలు, నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి గురించి స్పష్టమైన అవగాహనకు వచ్చారు. యువగళం పాదయాత్ర 2023 జనవరి 27న ప్రారంభించారు.

పాదయాత్ర సుధీర్ఘంగా సాగవచ్చనే ముందుచూపుతో మంగళగి రి నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేసిన లోకేష్‌ ఇంటింటికి వెళ్లారు. అందరినీ పలకరించారు. తాను పాదయాత్రలో ఉన్నా..మంగళగిరి నియోజక వర్గంలో తాను ఉన్నట్టే ఏ ఒక్క కార్యక్రమం ఆగకుండా తన టీముతో పర్యవేక్షించేవారు. పాదయాత్ర అనంతరం మళ్లీ మంగళగిరి నియోజకవర్గం అంతా పర్యటనలతో చుట్టేశారు. ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గంలో 66 రచ్చబండ కార్యక్రమాలకు హాజరు అయ్యారు.

12 అపార్ట్‌మెంట్లలో సమావేశాల్లో పాల్గొన్నారు. వారి సమస్యలు తెలుసుకుని అవి ఎంతవరకూ పరిష్కరించగలమో చర్చించారు. లోకేష్‌ నిజాయితి, నిబద్ధత చూసిన అపార్ట్‌మెంట్‌ వాసులు పోలింగ్‌ బూత్‌లకు పోటెత్తారు. మంగళగిరి నియోజకవర్గానికి తమ విశేష సేవలు అంది స్తున్న వివిధ రంగాల ప్రముఖులను, తటస్థులను నేరుగా వారి ఇళ్లకే వెళ్లి కలిశా రు. మంగళగిరి సర్వతోముఖాభివృద్ధికి తన ప్రణాళికలు వివరించి మద్దతు కూడగ ట్టారు. అన్ని వర్గాలకు చేరువై అందరివాడైన మన లోకేష్‌ అని నినదించింది మంగళగిరి.

LEAVE A RESPONSE