ప్రకాశంజిల్లాలో సాగుతున్న మహా పాదయాత్ర

– తండోపతండాలుగా తరలి వస్తున్న అశేష ప్రజానీకం
– అమరావతి రైతులకు మద్దతుగా కదం తొక్కుతున్న ప్రజానీకం,ఇసుకేస్తే రాలని జన సందోహం,అడుగడుగునా జన నీరాజన
– అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్న రైతులు ప్రజలు విద్యార్థులు
– దారిపొడవునా పూలవర్షం ఉద్యమంలా పాదయాత్ర
యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండి ప్రదర్శన ఒంగోలు గిత్తలతో అన్నదాతలు ఇంకొల్లులో మానవహారంతో స్వాగతం పలికిన విద్యార్థులు కోలాటాలతో చిన్నారులు మహిళలు అమరావతికి మద్దతుగా విశాఖ మహిళ మహాపాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.
అమరావతి పరిరక్షణ ధ్యేయంగా సాగుతున్న మహాపాదయాత్ర ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకొంది. మంగళవారం పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు లో సాగిన యాత్ర జనసంద్రంగా మారింది. యాత్రకు అడుగడుగున ప్రజలు జన నీరాజనం పలుకుతున్నారు. అమరావతి నినాదాలతో ఇంకొల్లు వీధులు మారుమ్రోగాయి. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు యాత్ర లో అగ్రభాగాన నడుస్తూ ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించారు. సామాన్య కార్యకర్తలా తలగడ చుట్టి అమరావతి, జాతీయ జెండా చేతపట్టి జై అమరావతి జై జై అమరావతి అంటూ నినదిస్తూ ముందుకు సాగారు. దీంతో ప్రజలు జన సమూహంలా యాత్రలో అడుగులో అడుగేస్తూ కదంతొక్కారు.
జన సునామీని తలపించిన ఇంకొల్లు వీధులు..
మహాపాదయాత్ర ఇంకొల్లు నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారితో కలిసి అమరావతి జేఏసీ నేతలు వెంకటేశ్వరస్వామి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంకొల్లు నగరంలో మహా పాదయాత్రకు జనం నీరాజనం పలికారు. వీధులన్నీ జనసంద్రం అయ్యాయి. ఎక్కడికక్కడ మహిళలు హారతులు ఇస్తూ వార పోస్తూ…. గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ…. పాదయాత్ర విజయవంతం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరం ప్రారంభం నుంచి పూలవర్షం కురిపించారు.
ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండి…
ఇంకొల్లు నగరంలో మహా పాదయాత్రలో ఎడ్లబండి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే ఏలూరి ఎడ్లబండిపై ప్రదర్శనలో పాల్గొన్నారు. పర్చూరు నియోజకవర్గంలో మహా పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు తండోపతండాలుగా రావడంతో దారులన్నీ ప్రజలతో పులకించి పోయాయి.
పాదయాత్రలో కోలాట నృత్యాలు
మహా పాదయాత్ర అగ్రభాగాన మహిళలు చిన్నారులు కోలాట నృత్యం ప్రదర్శన అందరినీ అలరించింది. అమరావతి పాటలకు కోలాటం అడుతూ అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
పాదయాత్రలో ఒంగోలు గిత్తలు
ఒంగోలు పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఒంగోలు గిత్తలు పాదయాత్రలో కదం తొక్కాయి. అమరావతి ఉద్యమ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ అన్నదాతలు ప్రదర్శనలు మూడు జతల ఎడ్లు అమరావతి రైతులకు సంఘీభావంగా కొనికి వరకు అడుగులు వేశాయి.
అడుగడుగునా పూలవర్షం
మహా పాదయాత్ర లో అమరావతి రైతులకు ఎమ్మెల్యే ఏలూరి సారధ్యంలో ప్రజలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున హారతులు పడుతూ…. వీర తిలకం దిద్దుతూ అమరావతి ఆకాంక్షను వ్యక్తం చేశారు.
అమరావతి రైతులకు మద్దతుగా అడుగులో అడుగులు వేస్తూ
ఎమ్మెల్యే ఏలూరి సారధ్యంలో పర్చూరు నియోజకవర్గంలో జరిగిన మహా పాదయాత్రకు ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. మహా పాదయాత్రకు సంఘీభావంగా ఎమ్మెల్యే ఏలూరి అడుగులో అడుగు వేస్తూ… ఊరు వాడా కదిలి రావడంతో దారులన్నీ కిక్కిరిశాయి.
త్రివర్ణ పతాకంతో ఎమ్మెల్యే ఏలూరి పాదయాత్ర
అమరావతి రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే ఏలూరి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రలో ఎమ్మెల్యే ఏలూరి జాతీయ జెండా అమరావతి జెండాను చేతబూని అమరావతి రైతులలో ఉత్సాహాన్ని నింపారు. సామాన్య కార్యకర్తలా అమరావతి రైతులతో ఉంటూ వారితోనే భోజనం చేస్తూ వారితోనే విశ్రాంతి తీసుకుంటూ… వారికి కొండంత అండగా నిలుస్తున్నారు.
తరలివచ్చిన తెలంగాణ వాసులు
అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు సంఘీభావంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి 100 మంది నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో అమరావతి జేఏసీ నేతలను కలిశారు. అమరావతి కోసం చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మహిళా నేతలు ఇంకొల్లు లో మహా పాదయాత్రలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున అమరావతి రైతులకు విరాళం అందజేశారు.
నేను సైతం అంటూ…విశాఖ మహిళలు
రాజధాని అమరావతి పరిరక్షణ యాత్రలో విశాఖపట్నం గాజువాక కు చెందిన ఎర్ర మాధవీలత జై అమరావతి జై జై అమరావతి అమరావతి పాదయాత్ర నేను సైతం అంటూ… నాది విశాఖపట్నం నా రాజధాని అమరావతి అంటూ ప్ల కార్డులతో పాల్గొని మద్దతు తెలిపారు. అమరావతి రైతులకు 5000 రూపాయలు విరాళం అందజేశారు.
ఉద్యమ కెరటంలా మహాపాదయాత్ర
మహా పాదయాత్ర పర్చూరు నియోజకవర్గంలో మహా ప్రభంజనంలా సాగుతుంది. ప్రజలంతా అమరావతి రైతుల యాత్రకు సంఘీభావం తెలుపుతూ రాజధాని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి అమరావతి రైతుల , ఆంధ్రుల ఆకాంక్షలను అర్థం చేసుకొని మూడు రాజధానులు ప్రతిపాదనను విరమించుకోవాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలి. అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్రలో నిలిచి ఉంటుంది.

Leave a Reply