Suryaa.co.in

Andhra Pradesh

సచివాలయ, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయండి

– అకాలవర్షంలో నష్టపోయిన రైతులను ఆదుకోండి
– ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు

ఒంగోలు: ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు లో అనుక్షణం ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని, ముఖ్యంగా రాష్ట్రంలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన పంటల సమగ్ర నివేదిక క్షేత్రస్థాయిలో తయారుచేసి రైతులకు ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేలా, రైతులను ఆదుకోవాలని రైతులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని వివిధ సంఘటనలు ప్రస్తావించారు.

నష్టపోయిన రైతులు అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున కేంద్ర ప్రభుత్వం కు నివేదిస్తామని, రైతులకు ఆదుకునేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనుక్షణం పోరాడుతూనే ఉంటుందని ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై గొంతు నొక్కడం ఆ చిత్తశుద్ధిని ప్రజా సమస్యలను తీర్చడంలో చూపెట్టాలని సూచించారు.

రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసి రాష్ట్రంలో అధికారంలోకి రావడాన్ని లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని, కేంద్ర పథకాలను తమ పథకాలుగా స్టిక్కర్లు వేసుకుని ఇంకా ఎన్నిరోజులు పబ్బం గడుపుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో బీజేపీ బలోపేతానికి కార్యాచరణ రూపొందించామని చెప్పారు. జిల్లాలో జరుగుతున్న మతమార్పిళ్లపై దృష్టి సారించామని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పీవీ శివారెడ్డి, రాయపాటి అజయ్ , మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కోటేశ్వరి, మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కలీఫతుల్లా భాష, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి షైక్ కరీం గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లరి రామయ్య బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగోతం రాజేష్ పలువురు నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE