రసికరాజ తగువారము..

ఒకటా రెండా..
వంద భాషలు..
ఆ భాషల్లో
సంతకాలు పెట్టి
ఊరుకున్నాడా..
అన్ని భాషల్లో ప్రవేశం..
చాలా భాషల్లో పాండిత్యం..
మల్లాది రామకృష్ణతో సాన్నిహిత్యం..
అక్షరాలతో సాంగత్యం..!

సాహిత్యంలో మల్లాది
చేపట్టని ప్రక్రియా…
సంకలనాలు..నవలలు..
సినిమా పాటలు..నాటికలు..
అన్నీ ఆయన కళావాటికలు!

కవితలు ఛందోబద్ధం..
జీవితం నియమబద్ధం..
మాట నిబద్ధం..
ఇవన్నీ మదరాసు
పానగల్లు పార్కు
బల్లకు ఎరుక..
అదే మల్లాది వారి
రోజువారీ
పండిత పరిషత్తుకు వేదిక..
తనకు ఇక్కట్లు ఉన్నా
తన చుట్టూ చేరే వారికి
భోజన టిక్కెట్లు..
బువ్వ ముందు..
పిదప సాహితీ విందు..
నిజానికి మల్లాది మాటలే
బొజ్జ నిండిపోయేంత పసందు..!

మల్లాది విరచిత
చలువ మిరియాలు
సాహితీ మరమరాలు..
ఎన్నో సినిమాలకు
అజ్ఞాతంగా రాసేసి
తొణక్కుండా..
వెండితెరపై నిండకుండ..
*రసిక రాజ*
*తగువారము కామా..*
అంటూ కామాల్లేకుండా
పాటలు రాసేసిన మల్లాది
*మది శారదా దేవి మందిరమే..*
అలా మ్రోగించి
సినీగీతాల ‘జయభేరి’…
ప్రవహింపజేస్తూ సాహితీఝరి..!
మల్లాది రామకృష్ణశాస్త్రి జయంతి నేడు

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply