-కోదండరామ్ టీజేఎస్ కు గుడ్ బై చెప్పిన ఉద్యమకారుడు కిరణ్
-బీజేపీ క్షుద్ర రాజకీయాలను నిరసిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ చేరుతున్నట్లు ప్రకటన
-ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు ఆకుల రజిత్ ల నాయకత్వాన మంత్రి కేటీఆర్ తో సమావేశమైన నాయకులు
-వారికి ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కండువాలు కప్పి టీఆర్ఎస్ లోకి సాదర స్వాగతం పలికారు
హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు పలువురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువాలు కప్పుకున్నారు.చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేట గ్రామ సర్పంచ్ చక్రం జంగయ్య,ఆయనతో పాటు వివిధ వార్దుల సభ్యులు గంధం సతీష్, పరిదం సురేష్ వద్ది రాజు, ముద్దంగుల యాదయ్య, బక్కతట్ల లింగస్వామి, సీనియర్ నాయకులు దండుగుల వెంకటేష్, పరిదం శేఖర్, దండుగుల రాజు తదితరులు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.
టీజేఎస్ ప్రముఖ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు పాశం కిరణ్, చండూరు కు చెందిన బీజేపీ నాయకుడు రామస్వామి వెంకటేశ్వర్లు తదితరులు టీఆర్ఎస్ లో చేరారు.బీజేపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, క్షుద్ర రాజకీయాలను నిరసిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు ఆకుల రజిత్ ల నాయకత్వాన వారంతా మంత్రి కేటీఆర్ ను కలిసి టీఆర్ఎస్ కు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి అఖండ విజయం చేకూర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని కేటీఆర్ తో మాట్లాడుతూ హామీనిచ్చారు.అటుతర్వాత బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రవిచంద్ర నివాసంలో కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ వారి మెడలో గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ లోకి సాదర స్వాగతం పలికారు.