ఇప్పటికీ చాలా మందికి జీతాలు రాని పరిస్థితి

-అర్చకులకు ఎందుకు అడ్డుకున్నారు?
-కంచెలు బద్దలు కొట్టడం అంటే ఇదేనా
-ఓవర్సీస్ స్కాలర్ షిప్ రావడం లేదు
-గ్రంధాలయా లలో పని చేసే ఉద్యోగులకు జీతాలు రావడం లేదు
– బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్

తెలంగాణ రాష్ట్రం లో ఉన్న 6441 దేవాలయాల్లో దుప దీప నైవేద్యం 2500 నుండి 6000 లకు పెంచడం జరిగింది. ఆ తరువాత నెలకు 10000 రూపాయలు పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము మొదటి 1వ తేదీ నాడే జీతాలు ఇస్తున్నాం అన్నారు.ఇప్పటికీ చాలా మందికి జీతాలు రాని పరిస్థితి ఉంది.

గత 6 నెలలుగా దుప దీప నైవేద్యం కింద జీతాలు ఇవ్వడం లేదు. కొన్ని దేవాలయాలకు మాత్రమే జీతాలు ఇచ్చారు. ఇవాళ చలో సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. కానీ సచివాలయం ముట్టడికి వస్తున్న అర్చకులను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు.మాది ప్రజా పాలన అన్నారు. మేము కంచెలు తొలగించాం అన్నారు. మరి ఇవాళ అర్చకులకు అడుగడుగునా ఎందుకు అడ్డుకున్నారు. ఇందులో ఒక్క బ్రాహ్మణులు మాత్రమే లేరు.ఇతర కులాల వారు ఉన్నారు.

అయితే నిన్న దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇవాళ్టి ముట్టడికి వాయిదా వేసుకున్నారు. గ్రంధాలయాలలో పని చేసే ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ రావడం లేదు.ఇప్పటికే మంజూరు అయి ఉన్న వాటిని కూడా నిలిపి వేశారు.వెంటనే మంజూరు అయిన వాటిని విడుదల చేయాలి.

అర్చకులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మా పార్టీ డిమాండ్ చేస్తున్నాము. నాటి మా ప్రభుత్వం చాలా మందిని రెగ్యులరైజ్ చేసింది ఇంకా కొంత మందిని చేయాల్సి ఉంది వెంటనే చేయాలి. సచివాలయం అర్చకులను పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు వారిని ఎందుకు అడ్డుకున్నారు? కంచెలు బద్దలు కొట్టడం అంటే ఇదేనా.

Leave a Reply