వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు
మంగళగిరి: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మరణాలకు గల కారణాల్ని తెలియజెప్పే వైద్య ధృవీకరణ పథకాన్ని జనన మరణాల్ని నమోదు చేసే సివిల్ రిజిస్ట్రేషన్ విధానంతో అనుసంధానం చేయడమే కాకుండా ప్రామాణీకరిం చాల్సిన అవసరం కూడా ఉందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అభిప్రాయపడ్డారు.
ఇందుకు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఇప్పటికే మార్గదర్శకాల్ని జారీ చేశారన్నారు. మెడికల్ కాలేజీల ఆసుపత్రులు, జిల్లా మరియు స్పెషలైజ్డ్ ఆసుపత్రుల్లో ఇప్పటికే ఎంసిసిడి స్కీం అమలవుతోందని, ఇప్పు డు సిఆర్ఎస్ పోర్టల్ కు అనుసంధానం చేశారని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకనుగుణంగా మరణాలకు సంబంధించి కచ్చితమైన కారణాన్ని నమోదు చేసేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు