*వ్యాధి నిరోధక శక్తి క్షీణించిన వారికి ముప్పు!!
*డయాబెటిస్ పేషెంట్స్ కి హాయ్ రిస్క్!!
*అధికముగా ఆల్కహాల్ సేవించేవారు హై రిస్క్!!
*ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు హాయ్ రిస్కు.
*వ్యాధి నియంత్రణ ప్రణాళిక ఏపీలో కట్టడి కాకపోతే, పక్కన ఉన్న జిల్లాలు, రాష్ట్రాలకి ముప్పు తప్పదు.
* చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు,విషమిస్తున్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై ముఖ్యమైన, కీలకమైన వైద్య సూపర్ స్పెషాలిటీ అభిప్రాయాన్ని అందజేసిన వైద్యుడు డాక్టర్ వ్యాకరణం.
* తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రపత్తంగా ఉండాలని హెచ్చరిక.
వ్యాధి తీవ్రత పట్ల హెచ్చరించిన ప్రముఖ ఇమ్మ్యూనాలజిస్ట్ & పల్మనాలజిస్ట్,
ప్రపంచ అలర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు
డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్.
వ్యాధి లక్షణాలు:
*జ్వరము,
*ఊపిరితిత్తులు నిమోనియా (ఇన్ఫెక్షన్),
*చర్మం మీద యాప్సిస్( చీము పట్టడం)
*చర్మం మీద అల్సరేషన్( పుండ్లు ఏర్పడడం)
*ఎముకలు, జాయింట్ లో నొప్పి.
*తీవ్రమైన తలనొప్పి.
*కడుపు నొప్పి.
కలుషిత నీరు!! కలుషిత భూమి లో ఉండే వారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన 24 గంటల లోపల వ్యాధి లక్షణాలు బయట పడవచ్చు.
వియత్నాం దేశంలో 1966 లో ఈ వ్యాధి విలేయాతాండవం చేసినందుకు కారణంగా దీన్ని అక్కడ “వియత్నాం టైం బాంబ్” గా పిలుస్తారు.
బర్కోల్డ్ఏరియా సూడోమలై అనే అతి భయంకరమైన బ్యాక్టీరియా- క్రిమి, గాయమిర్పడిన చర్మమునుండేనా, శ్వాస ప్రక్రియనుండైన, కలుషిత తిండి రూపాన, శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
ఈ వ్యాధి చికిత్స విధానము
A)ఇంటెన్సివ్ ఫేస్
B) ఇరాడికేషన్ ఫేస్ – రెండు గా ఉంటాయి.
IV యాంటీ బయోటిక్ తెరపీ, ఓరల్ యాంటీ బయోటిక్ థెరపీ, వెంటనే రోగికి అందించవలెను.
వ్యాధి నిరోధక శక్తి మరింత క్షీణించకుండా వెంటనే చేపట్టవలెను.
భయంకర పరిస్థితులు::
1)వ్యాధి కంట్రోల్ కాని ఎడల యందు విపరీతముగా వ్యాప్తి చెందును.
2)కాలేయము, ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలు, ఎముకలు, జాయింట్లు,తదితర బాడీ అవయవాలలో వ్యాప్తి చెంది సేఫ్టీసీమియాగా( భయంకరమైన కుళ్ళిపోయే మార్పులు) మారి ప్రాణాంతకము కావచ్చు.
3)కలుషిత భూమి, కలుషిత నీరు, పరిస్థితులు చక్కది దిగ పోతే 16 సంవత్సరాల వరకు ఈ క్రిమిలు ఉండవచ్చు.
4)సరిగ్గా చికిత్స విధానము అందని పరిస్థితుల్లో రోగి శరీరంలో 29 సంవత్సరాల వరకు ఉండవచ్చు.
5)రైతులు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనిచేసే కార్మికులు, మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది, వెటర్నరీ సిబ్బంది, అప్రమత్తంగా ఉండాలి.
యుద్ధ ప్రాతి పథకన చేయవలసిన పనులు!!
1)వ్యాధిపట్ల, దాని తీవ్రత పట్ల ప్రజలలో సంపూర్ణ అవగాహన పెంచడం
2)వ్యాధి లక్షణాలు ఉన్న రోగులను వెంటనే ఆసుపత్రికి తరలించడం
3)అక్కడ ఉన్న ప్రజలకు వ్యాధి నిరోధక శక్తి క్షీణించకుండా, మల్టీ విటమిన్ మందులు అందించడం.
4)డయాబెటిక్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు, వ్యాధి నిరోధక శక్తి క్షీణించిన హెచ్ఐవి పేషెంట్లు, తదితర దీర్ఘ లో రోగంలోని బాధపడుతున్న పేషెంట్లను వెంటనే గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిపై నిగ పెట్టడం.
5) పారి శుభ్ర కార్యక్రమాలను యుద్ధ ప్రాతి పథకన చేపట్టి, కలుషితము లేని త్రాగునీరు అందించడం అతి ముఖ్యం.
6) ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రైవేట్ + గవర్నమెంట్ ఆస్పత్రుల్లో, ఏ రకమైన పేషెంట్ వచ్చిన, సంపూర్ణంగా మేలియాయిడోసెస్ వ్యాధి
పరీక్షలు చేయించడం అతి కీలకమైన నిగా విషయం.