Suryaa.co.in

Telangana

కొమురంభీమ్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండి

– శాసనసభలో డా.పాల్వాయి హరీష్ బాబు

హైదరాబాద్ : నిధులు కేటాయించని పక్షంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండి అని శాసనసభలో డా.పాల్వాయి హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో సాగునీటి రంగం, సివిల్ సప్లైస్ పై జరిగిన పద్దుల చర్చ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు నిధులు కేటాయించని పక్షంలో పక్కనే ఉన్న మహారాష్ట్రలో కలిపేయమని డిమాండ్ చేశారు. తమ ఆవేదనను సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నామని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం శాసనసభ కమిటీ వేయాలని, వెనకబాటుతనంపై అధ్యయన, పరిష్కార మార్గాలు సూచించాలని కోరారు.

అలాగే తుమ్మిడి హెట్టి వద్ద డా.బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని, జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు పూర్తి చేయాలని, పీపీ రావు ప్రాజెక్టు పూడిక తీసి 11 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని కోరారు.

గత ప్రభుత్వం కేవలం దక్షిణ తెలంగాణకు నీళ్లు తరలించి ఉత్తర తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని, వాటిని సవరించాలని కోరారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు రోడ్ల నిర్మాణం కోసం రూ.12 కోట్ల నిధులు అటవీ శాఖకు చెల్లించాలని కోరారు.

LEAVE A RESPONSE