ప్రతి లావాదేవీ ఆన్లైన్..
సగటు జీవికి తప్పదు
బ్యాంకుల్లో క్యూలైన్..
అప్పులెగ్గొట్టి పారిపోయిన
బడాబాబులకు రాయితీల్లో
ఫ్రంట్ లైన్..
ఇలాంటి దగకోరుల కోసం
పాలకుల దగ్గరే హెల్ప్ లైన్…
పెభువులతో మంతనాలకు
హాట్ లైన్..
ఈ విధానాల వల్ల మునిగిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థకు పేద,మధ్యతరగతి
ప్రజల రక్తమే సెలైన్..
ఇదే..ఇదే..
గత ఎనిమిదేళ్లలో
మోడీ రాసిన
స్పెషల్ స్టోరీ
విత్ బైలైన్…!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286